A place where you need to follow for what happening in world cup

స్వచ్ఛమైన తెలంగాణ పల్లె కథ.. రివెంజ్ డ్రామాతో కడుపుబ్బా నవ్వించే “తురమ్ ఖాన్ లు” షూటింగ్ పూర్తి.

0

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలంగాణ మట్టి కథలను, తెలంగాణ నేపథ్యంలో వస్తున్న పల్లె కథలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇదే తరహా తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా తురుమ్ ఖాన్ లు.”స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ” బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో  రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శంషాబాద్ లో జరిగిన ఆఖరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుంది. పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రంలో దాదాపు 90 శాతం కొత్త నటీనటులే నటించారు. చిత్ర దర్శకుడు శివకళ్యాణ్ మాట్లాడుతూ… 12 ఏళ్లుగా తెలుగులో ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన నాకు దర్శకుడిగా మొదటి సినిమా ఈ తురుమ్ ఖాన్ లు అని తెలిపారు. నన్ను, నా కథని నమ్మిన నిర్మాత ఆసిఫ్ జానీ కి ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానన్నారు.

పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘PVT04’లో అందాల ‘చిత్ర’గా అలరించనున్న శ్రీలీల.

ఈ ఆదునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టీపెరిగీ సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు, ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం తురుమ్ ఖాన్ లు అన్నారు. నిర్మాత ఆసిఫ్ జానీ మాట్లాడుతూ.. బలమైన కథ, సహజమైన పాత్రలు ఉన్న ఈ చిత్రాన్ని క్వాలిటీగా రూపొందించడానికి ఎక్కడా, ఏ మాత్రం కాంప్రమైజ్ అవలేదని అన్నారు. సినిమా  అనుకున్న దానికంటే బాగా వచ్చిందని అన్నారు. ఈ మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి భారీ  ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇది  చిన్న సినిమాగా రిలీజ్ అవుతుందని.. ఒకసారి ప్రేక్షకులకు చేరువైన తర్వాత వారే దీన్ని పెద్ద సినిమా చేస్తారనే నమ్మకం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, పులి సీత, విజయ, శ్రీయాంక

Leave A Reply

Your email address will not be published.