అమరుల కుటుంబాల సంక్షేమం కోసం ‘ప్రాజెక్టు నమన్’
Indian Army launched 'Project Naman' to help the families of martyrs
అమరవీరుల కుటుంబాలకు సాయం చేయడం కోసం ఇండియన్ ఆర్మీ ‘ప్రాజెక్టు నమన్’ను ప్రారంభించింది. సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాల సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రత్యేక కేంద్రాన్ని తొలిసారిగా ఢిల్లీ కంటోన్మెంట్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ ఇండియా ఆర్మీ వెటర్నన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సీఎస్ఈఈ- గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. దీనిలో సైనిక కుటుంబాలకు సౌకర్యాలు కల్పించడానికి ఒక కామన్ సేవా కేంద్రం ఉంటుంది. అన్ని ప్రభుత్వ కస్టమర్ సేవలను అందజేస్తుంది. ఈ ప్రాజెక్టు రెండో దశలో దేశవ్యాప్తంగా వివిధ సైనిక స్టేషన్లలో మరో 13 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.