A place where you need to follow for what happening in world cup

దేశానికే ఆదర్శంగా జగనన్న పాలన

0

చాగలమర్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసన మండలి విప్‌ గంగుల ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి లు తెలిపారు.గురువారం చాగలమర్రి పట్టణం లోని మల్లెవేముల రస్తాలో గల కేజిఎన్‌ పంక్షన్‌ హాల్‌లో మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమంలో భాగంగా గృహ సారథులు,సచివాలయాల కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే  మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు.సంక్షేమ పథకాలు కుల,మతాలకు,పార్టీలకు అతీతంగా అమలు చేసిన ఘనత సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కే దక్కిందన్నారు.ఇవాళ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి సంక్షేమ పథకాలు అమలు,అభివృద్ది గురించి వివరిస్తున్నామంటే అందుకు కారణం సిఎం జగన్‌ అన్నారు.

గత ప్రభుత్వంలో  జన్మభూమి కమిటీలు పేరుతో సంక్షేమ పథకాల ద్వారా టిడిపి వారే లబ్ధి పొందారన్నారు.నూతనంగా నియమింపబడ్డ సచివాలయాల కన్వీనర్లు,గృహ సారథులు, వాలంటీర్లు, నాయకులు సమన్వయంతో  ఇంటింటికి వెళ్ళి ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజలలో వైసిపి పై విశ్వసనీయత పెంపొందించేలా కృషి చేసి తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.అలాగే త్వరలో జరగనున్న పక్షిమ  రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి గెలుపుకు అందరు కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో పరిశీలకులు నరసింహారెడ్డి,వైసీపీ రాష్ట మైనార్టీ సెల్‌ కార్యదర్శి బాబులాల్‌,మండల కన్వీనర్ కుమార్ రెడ్డి,ఎంపిపి వీరభద్రుడు,మార్కెట్ యార్డు వైస్‌ చైర్మను నరసింహారెడ్డి,జిల్లా ప్రచార కార్యదర్శి గణేష్‌ రెడ్డి,సేవాదళ్‌ అధ్యక్షుడు వెంకట రమణ,సింగిల్‌ విండో అధ్యక్షుడు దస్తగిరి, ఎంపిటీసిలు,సర్పంచ్లు, వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.