Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏపీ డిస్కమ్ లు దివాళా?

0

జగన్ సర్కార్ విద్యుత్ సంస్థలకు డబ్బులు ఎగ్గొట్టేందుకు కొత్త పన్నాగం పన్నింది. ఏపీ డిస్కమ్ లు దివాళా తీశాయనీ, చెల్లింపులకు డబ్బులు లేవనీ చెబుతోంది. ఏపీ విద్యుత్ సంస్థలు ఏకంగా తమకు విద్యుత్ సరఫరా చేసిన సంస్థలకు చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని కోర్టుకు విన్నవించాయి.  వాస్తవానికి సాంప్రదాయేతర విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ కు పీపీఏల ప్రకారం చెల్లింపులు చేసి తీరాల్సిందేనని గత మార్చి 15న విస్పష్ట తీర్పు ఇచ్చిన ఏపీ హై కోర్టు ఆ చెల్లింపులకు ఆరు వారాల గడువు ఇచ్చింది.

 

అయితే ఆ తీర్పును ఏ మాత్రం ఖాతరు చేయని ప్రభుత్వం ఈ ఆరు వారాల పాటూ ఎటువంటి చెల్లింపులూ చేయలేదు. ఇప్పుడు తమ వద్ద డబ్బులు లేని కారణంగా చెల్లింపు చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు చెబుతోంది. వాస్తవానికి గత ప్రభుత్వం సాంప్రదాయేతర విద్యుత్ సంస్థలతో చేసుకున్న పీపీఏలను వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే రద్దు చేసింది. ఆ సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు పీపీఏల ప్రకారం ముందుకు పోవలసిందేనని తీర్పు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిల్లులు చెల్లించడం నిలిపివేసింది. దీంతో ఆ కంపెనీలు మళ్లీ కోర్టును ఆశ్రయించాయి.

 

ఈ సారి కోర్టు మరింత విస్పష్టంగా పీపీఏల ప్రకారం చెల్లింపులు చేయాలని, బకాయిలు, భవిష్యత్ లో ధరలు కూడా పీపీఏలలో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలని తేల్చి చెప్పింది. దీంతో ఏపీ సర్కార్ విద్యుత్ కంపెనీలకు చెల్లించాల్సిన  బకాయిలు రమారమి రూ.20 వేల కోట్లుగా తేలింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ సొమ్ము చెల్లించి తీరాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇదిగో ఇక్కడే సర్కార్ కొత్త ఎత్తుగడకు తెరలేపింది. డిస్కమ్ లు రుణాల ఊబిలో కూరుకున్నాయనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కమ్ లు ఇప్పుడు చెల్లింపులు చేసే పరిస్థితిలో లేవనీ కోర్టుకు విన్నవించుకుంది.

 

వాస్తవానికి ఏపీ సర్కార్ పీపీఏల బకాయిలు ఎగ్గొట్టే ఎత్తుగడతోనే వాటి నుంచి విద్యుత్ తీసుకోకుండా అంతకంటే అధికదర చెల్లించి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసిన సందర్భాలు బోలెడున్నాయి.పీపీఏల విషయంలో ఏపీ తీరును కేంద్రం కూడా ఆక్షేపించింది. పీపీఏలను సమీక్షించడం సరికాదని జగన్ సర్కార్ ను హెచ్చరించింది. దీని వల్ల పెట్టుబడిదారులు ఏపీని బ్లాక్ లిస్ట్ లో పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినా వినకుండా జగన్ సర్కాన్ మూర్ఖత్వంతోనో, మొండి తనంతోనో, గత ప్రభుత్వంవి అన్నీ రద్దు చేయాలన్న ఉద్దేశంతోనో పీపీఏల సమీక్షతో ముందుకు సాగింది.

చైన్ స్నాచింగ్‌లో కొత్త స్టైల్.

ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, అలాగే పీపీఏలకు భారీ మెత్తంలో బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇప్పుడు కోర్టులో ఏపీ వాదనపై తీర్పు ఏ విధంగా వస్తుందన్నది వేచి చూడాలి. అయినా విద్యుత్ కంపెనీలకు పీపీఏల ప్రకారం చెల్లింపులలో ఏపీ విఫలమైతే నేరుగా ఆర్బీఐ నుంచి రాష్ట్ర నిధులు చెల్లిస్తామని గతంలోనే కేంద్ర విద్యుత్ మంత్రి హెచ్చరించిన సంగతి తెలిసిందే ఏపీ సర్కార్ దివాళా ఎత్తుగడ ఫలించే అవకాశం లేదనీ, ఆర్బీఐ నుంచి పీపీఏలకు బకాయిలను రాష్ట్ర వాటా నుంచి కేంద్రమే చెల్లించే అవకాశాలే మెండుగా ఉన్నానీ పరిశీలకులు అంటున్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie