సుప్రసిద్ధ బహుభాషా నటీమణి లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు మరణం చిత్ర పరిశ్రము తీరని లోటు. ఆమె మరణ వార్త తెలిసి ఎంతో చింతించాను. వెండి తెరపై సత్యభామ అంటే జమున గారు అనేలా గుర్తుండిపోయారు. ఎన్నో పౌరాణిక పాత్రలకు జీవం పోశారు. ప్రేక్షకలోకంలో స్థిర కీర్తిని సముపార్జించుకున్నారు. లోక్ సభ సభ్యురాలిగా ప్రజలకు ఎన్నో సేవలందించారు. కళాపీఠం తరఫున ఆమెను సమున్నతంగా సత్కరించు కోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
శ్రీమతి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
డా. టి. సుబ్బరామిరెడ్డి
మాజీ రాజ్యసభ సభ్యులు