Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జనసేన జనబాట కార్యక్రమం

0

గూడూరు
జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే విధంగా జనబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు  .  గూడూరు పట్టణంలోని గమళ్ళపాలెం ప్రాంతంలో జన బాట కార్యక్రమాన్ని నిర్వహించారు .
గూడూరు పట్టణంలోని గమళ్ళపాలెం ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జనసేన పార్టీ నాయకులు జన బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు .

ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్  మాట్లాడుతూ పార్టీ కేంద్ర కమిటీ గెలుపు మేరకు జన బాట కార్యక్రమాన్ని చేపట్టామని , క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరిస్తామని కృషి చేస్తామని  హామీ ఇస్తూ , ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు . ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie