A place where you need to follow for what happening in world cup

HOT NEWS

Job Notification: 108 అంబులెన్స్ లలో ఉద్యోగ అవకాశాలు

0

ఈ,ఎమ్,ఆర్,ఐ  గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న 108 అత్యవసర అంబులెన్స్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మరియు డ్రైవర్(పైలట్) పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సిరిసిల్ల జిల్లా 108,102,1962, ప్రోగ్రాం మేనేజర్ సలీం మరియ జిల్లా కోఆర్డినేటర్ ఇమ్రాన్ సయ్యద్ ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మెడికల్ టెక్నీషియన్ కి బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎమ్,భీ ఫార్మసీ,డీ ఫార్మసీ డి,ఎం,ఎల్ టి, అర్హతలతో పాటు 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని, డ్రైవర్ (పైలట్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు లైట్ మోటార్ వెహికల్, బ్యాడ్జి,కలిగి 23 నుంచి 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు.

పై అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకొని ఈనెల 14వ తేదీ అనగా మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల డాక్టర్ సి నారాయణరెడ్డి కళామందిరం లో హాజరుకావాలని సూచించారు మరిన్ని వివరాల కోసం 9014151667 నంబర్లు సంప్రదించాలని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.