Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కేసిఆర్ అంటే నే రైతు బంధు…

0
  • సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క రిజర్వాయర్ లేదు..
  • కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు…
  • రిజర్వాయర్ ల కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం…
  • దండగ అన్న వ్యవసాయంను నేడు పండుగ గా చేసిన ఘనత కేసిఆర్ దే… మంత్రి కేటీఆర్..

రాజన్న సిరిసిల్ల: సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయం ను కాళేశ్వరం, సహా అనేక సాగు నీటి ప్రాజెక్టులతో స్వరాష్ట్రంలో పండుగ మార్చిన ఘనత సిఎం కేసిఆర్ దే నని,సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క రిజర్వాయర్ లేదు నీ, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్, అనేక ప్రాజెక్టులు రిజర్వాయర్ నిర్మించి, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ, రైతు బాంధవుడు అయ్యాడని మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో ని అగ్రికల్చర్ కాలేజీని బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించి, కాలేజీలోని వివిధ విభాగాలు,వాటి పనితీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామని, దేశానికే దిశానిర్దేశం చేసే వ్యవసాయ శాస్త్రవేత్తలుగా జిల్లెల కాలేజీలోని విద్యార్థులు తయారు కావాలని, తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశదిశ చూపుతోందని అన్నారు. సిఎం కేసిఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ విస్తరణ జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కొందరు మాట్లాడుతున్నారని,వారు తెలిసి మాట్లాడుతున్నారా,తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమానికి హెలికాప్టర్​లో వస్తున్నప్పుడు.. వరుసగా ఉన్న కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్ మానేరులో నీళ్లు నిండి కళకళలాడుతుంటే ఎంతో సంబురంగా అనిపించిందని అన్నారు.

సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క రిజర్వాయర్ లేదనీ,తెలంగాణ లో కొత్తగా చేపట్టిన రిజర్వాయర్ ల ద్వారా భూగర్భజల మట్టం పెరిగి కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని మంత్రి స్పష్టం చేశారు.
కేసిఆర్ అంటే నే రైతు బంధు అని అన్నారు.స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి గా ఉన్నప్పుడే వ్యవసాయ కాలేజీ, తో పాటుగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మంజూరైందని తెలిపారు. విద్యార్థులు ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలు గా, ఎంటర్ ప్రెన్యూ ర్ గా ఎదగాలని సూచించారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కు సాటి లై ట్ క్యాంపస్ మంజూరు తో పాటు వ్యవసాయ కాలేజీని పీజీ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలనీ మంత్రి కేటీఆర్ , వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కోరగా, సీఎం కేసీఆర్ తో అనుమతితో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు కాలేజ్ గా నామకరణం చేయాలని , కాలేజ్ ఆవరణలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆయన వ్యవసాయం శాఖ మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…..
ఆధునిక సదుపాయాలు ,అధునాతన సాంకేతిక పద్ధతులతో కూడిన వ్యవసాయ కాలేజీ దేశంలోనే అత్యుత్తమ కాలేజీ గా నిలుస్తుందని అన్నారు. తాను చిన్న, పెద్ద ఎందరో నాయకులను చూశానని, తనదైన ప్రత్యేక పనితీరు, డైనమిజంతో ప్రపంచంలోనే పేరుగాంచిన వ్యక్తి మంత్రి కేటీఆర్ అని కొనియాడారు. నా నియోజకవర్గాలలో 47 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కంటే మిన్నగా సిరిసిల్లను ఈ 9 ఎండ్లలో కేటీఆర్ అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఉబికి వచ్చిన భూగర్భ జలాల లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా నెంబర్ వన్ గా నిలి,చి అఖిల భారత సర్వీస్ అధికారులకు పాఠంగా మారడం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనతననే అని అన్నారు.. స్వరాష్ట్రం తెలంగాణలో ఇన్ని రిజర్వాయర్లు వస్తాయని ఎవరైనా సమైక్య రాష్ట్రంలో ఊహించారా ? అని ప్రజలను ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యమే కరువు ప్రాంతాలలో ప్రజలకు ఆహారంగా పంపిణీ అవుతుండడం మనందరికీ గర్వకారణం అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఒక కోటి 8 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, కేసీఆర్ ప్రత్యేక చొరవతో అది రెండు కోట్ల 30 లక్షల పెరిగిందన్నారు.అంతేకాకుండా కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీ రంగం అంతకంతకు అభివృద్ధి చెందుతూ 10 లక్షల మంది నిరుద్యోగులకు ఐటి రంగంలో ఉపాధి లభించింది అన్నారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర సహా పొరుగున ఉన్న రాష్ట్రాల ప్రజలు కొనియాడుతున్నారని, తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలను ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.తెలంగాణలో ఉన్న పథకాలు మరే రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి తరానికి మార్గదర్శకత్వం వహిస్తూనే రేపటి తరానికి నాయకత్వం వహించే దక్షత ఉన్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని అన్నారు.ఆధునిక వసతులు ,సాంకేతిక పద్ధతులతో కూడిన వ్యవసాయ కాలేజీ రావడం ఈ ప్రాంత విద్యార్థులకు అదృష్టమని అన్నారు.. సమైక్య రాష్ట్రంలో భూములు కలిగి ఉన్న ప్రజలు సాగు జలాల లభ్యత లేక ధాన్యం గింజల కోసం ప్రభుత్వ రేషన్ కోసం క్యూ లైన్లు లో నిలబడే దుస్థితి ఉండేది అన్నారు. ఆనాటి పరిస్థితులను చూసి చలించి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి రాష్ట్రమును సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు.సమైక్య చిధ్రమైన జీవితాలకు అప్పుడు సిరిసిల్ల నేలవుగా మారిందని, ఇప్పుడు డైనమిక్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బంగారు భవిష్యత్తుకు నెలవుగా మారిందని అన్నారు. భూగర్భ జలమట్టం పెరగడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముస్సోలి లోని శిక్షణ ఐఏఎస్ లకు పాఠంగా మారడం గర్వకారణమన్నారు.

సగానికి పైగా జనాభా వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న
దేశంలో ప్రభుత్వ ,ప్రైవేటు రంగాలలో కేవలం 700 లోపే వ్యవసాయ కళాశాలలు ఉన్నాయని, ప్రాధాన్యతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కాలేజీలను ఏర్పాటు చేస్తుందన్నారు.
స్వరాష్ట్రంలో రైతాంగ సంక్షేమ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఇప్పటివరకు వివిధ రూపేనా నాలుగు లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేసినారని అన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం వినూత్న నిర్ణయాలతో దేశ వ్యవసాయ రంగానికి ఒక కొత్త విప్లవాన్ని తెచ్చిందని,సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది అన్నారు. దేశం మొత్తంలో 95 లక్షల ఎకరాలలో వరి సాగు అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు అవుతున్నదని అన్నారు.తెలంగాణలో ఏ ఇంట్లో చూసినా సంక్షేమం, ఏ ఊరు చూసినా పచ్చదనం కనిపిస్తుందన్నారు . భావితరాలకు నీటి మూట సంపదను కేసీఆర్ సృష్టించారని తెలిపారు . సమైక్య రాష్ట్రంలో పోరాటాలకు నెలవుగా మారిన రాజన్న సిరిసిల్ల అభివృద్ధిలో స్వరాష్ట్రం లో నెంబర్వన్ గా నిలిచిందని అన్నారు . జరిగిన పనిని, జరుగుతున్న పనిని మెచ్చుకుంటూ జరగాల్సిన పనిపై సూచనలు చేయాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందని అన్నారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..
కెసిఆర్ 20 ఏళ్ల క్రింద తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకోకపోతే జిల్లాలో ఈ కళాశాల ఉండేదా అని ప్రజలను ప్రశ్నించారు. అసమానతలపై పోరాడిన నేల ,సీఎం కేసీఆర్ చొరవతో స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారిందన్నారు. అమెరికా స్థాయిలో తెలంగాణలోని వ్యవసాయ కళాశాల లో వ్యవసాయ అభివృద్ధికి ఊతమిచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయి అన్నారు . త్వరలోనే వ్యవసాయ రంగం పరిశ్రమగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. వ్యవసాయంలో రాబోయే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై విద్యార్థులు ఈ కళాశాలలో చేరిన మొదటి రోజు నుంచి ఆలోచించాలన్నారు. జడ్పీ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్లకు వ్యవసాయ కళాశాలను ఏర్పాటు కు కృషి చేసినందుకు మంత్రికే తారక రామారావు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. ఈ గడ్డపై కళాశాల వస్తదని ఎవరు ఊహించలేదని.. అమరులకు ఇది సరైన నివాళి అన్నారు. ప్రస్తుతం ఆహార భద్రత స్థానంలో పౌష్టికాహార భద్రత వచ్చిన దృష్ట్యా పుడ్ ప్రాసింగ్ యూనిట్లు పౌష్టికాహార భద్రతకు దోహదం చేస్తున్నాయన్నారు . పౌష్టికాహార భద్రతపై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన అన్నారు. చిన్న జిల్లా అయినా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాల, మెడికల్ కళాశాల తో పాటు సూపర్ స్పెషాలి హాస్పిటల్ వంటి గొప్ప మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి,ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్
రఘునందన్ రావు , రిజిస్ట్రార్ డాక్టర్ సుదీర్ బాబు, ప్రవీణ్ రావు,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్,రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్,
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందం చక్రపాణి, రామతీర్థపు మాధవి,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie