మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఖాళీగా ఉందా? లేక వచ్చిన అవకాశాల్ని వద్దనుకుని ఖాళీగా ఉంటుందా? అన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం తమిళ్ లో ఓ సినిమా మినహా ఎలాంటి సినిమాలు చేయలేదు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్దం కూడా జరిగింది. దీంతో సినిమాల విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా లావణ్య గ్లామర్ పాత్రలకు… ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటుంది. ఇక వరుణ్ తో పెళ్లి నేపథ్యంలో ఆమె ఇంకెంత కేరింగ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పుడు ఈ రకమైన నిర్ణయాలే తాజాగా ఆమె ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నట్లు ఓవార్త వైరల్ అవుతుంది. అభిజిత్ హీరోగా…లావణ్య హీరోయిన్ గా ‘స్కైలాబ్’ దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. అతి త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ లాక్ అయినట్లు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ వెబ్ సిరీస్ నుంచి లావణ్య త్రిపాఠిని తప్పిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదొక రొమాంటిక్ వెబ్ సిరీస్ అట. హీరోతో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లోనూ నటించాల్సి ఉంటుందట. పాత్రపరంగా హాట్ గానూ కనిపించాల్సి ఉంటుంది. దీంతో ఈ పాత్రకి లావణ్య తగ్గది కాదని భావించి ఆమెని తప్పించి కొత్త భామని తీసుకోవాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారుట.