A place where you need to follow for what happening in world cup

HOT NEWS

చేయి చేయి కలుపుదాం కాంగ్రెస్ ను గెలిపించుకుందాం..

0

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, దంగు శ్రీనివాస్ యాదవ్..

ప్రజాస్వామిక పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని అందరం చేయి చేయి కలిపి కాంగ్రెస్ ను గెలిపించుకుందామని ఆ పార్టీ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, దంగు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని ఎలికట్ట భవాని మాత ఆలయంలో కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ తోపాటు దంగు శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలునిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర స్ఫూర్తితో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోదో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. యాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఎల్లీకట్ట భవాని మాత, అలాగే ఎల్లీకట్ట దర్గా దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వివరించారు. మండలంలోని పుట్టోని గూడ గ్రామంలో హాత్ సే హాత్ జోడోయాత్ర నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యూ.ఐ జాతీయ కోఆర్డినేటర్ దినేష్ సాగర్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ మధు, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు రవీందర్. పెండ్లిమడుగు వంశీ గౌడ్, ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రదన కార్యదర్శి ప్రవీణ్ యాదవ్, కార్యదర్శి ఉదయ్ గౌడ్, షాద్నగర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కాట సుధీర్, జనరల్ సెక్రెటరీ మెరజ్, కొత్తూరు మున్సిపల్ కౌన్సిలర్స్ మాదారం నరసింహం, సోమ్లా నాయక్,జే శ్రీనివాస్, ఎంపీటీసీ రవీందర్ నాయక్, మాజీ ఎంపీటీసీ మాదారం కృష్ణ గౌడ్, సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి, మూర్తి, ఎలికట్ట వార్డ్ నెంబర్ అశోక్, యూత్ కాంగ్రెస్ కొత్తూరు మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, నందిగామ మండల అధ్యక్షుడు కృష్ణ, ఫారూఖ్నగర్ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్, కొందుర్గ్ మండల అధ్యక్షుడు ఆవుల శ్రీకాంత్, కేశంపేట్ మండల అధ్యక్షుడు శివ, షాదనగర్ మునిసిపల్ అధ్యక్షుడు అక్రంలాల, కొత్తూరు మున్సిపల్ అధ్యక్షుడు యసీన్, మహేందర్, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.