A place where you need to follow for what happening in world cup

HOT NEWS

సామాజిక శ్రేయస్సు కై పరిశ్రమిద్దాం

0

-మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి

మంథని
దేశ స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకున్నా జాతీయ పురోభివృద్ధి సమగ్రతలో మనమంతా శ్రేయోభిలాషులుగా ముందడుగు వేస్తూ సామాజిక శ్రేయస్సు కై పరిశ్రమిద్దాం మంథని విద్యార్థి యువత

వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి పిలుపునిచ్చారు.
శనివారం  మంథని అంబేద్కర్ చౌక్ లో విభిన్న సమస్యల ప్రస్తావనతో సామాజిక సౌరభాలు స్వచ్ఛంద స్ఫూర్తి సంస్థ మంథని విద్యార్థి యువత

ఆధ్వర్యంలో ప్రచురించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు..
తాము  రూపొందించి ముద్రించిన గోడ పత్రికలలో విద్య‌, వైద్య‌ం‌‌‌‌,వ్యవసాయం‌, నిరుద్యోగం‌‌, ఓటు హక్కు లాంటి  అంశాలు

చోటుచేసుకున్నాయని,రాజకీయలకతీతంగా అట్టడుగు వారి స్రవంతి లో లబ్ది సమకూరేలా సమగ్ర విశ్లేషణల  అంశాలపై ప్రజలు తమ భావవ్యక్తీకరణ చేయాలని మారుతి కోరారు.
మంథని ఫ్రెండ్స్ క్లబ్

ఆవరణలో ఆదివారం నిర్వహించే సమావేశంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో మేడగోని రాజమౌళి గౌడ్, రామడుగు మారుతి రావు‌,వొల్లాల అశోక్,  గట్టు జయప్రకాష్,అడిచర్ల సమ్మయ్య లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.