ములుగు జిల్లాలోని మద్యం వ్యాపారుల బెల్ట్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ లైసెన్స్ షాపులలో దొరకని మద్యం, బెల్టుషాపులలో లభిస్తుందంటే బెల్టు దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. లైసెన్స్ ఉన్న దుకాణాలలో మందుబాబులకు మద్యం దొరకదు.. కానీ అధికంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపులకు వాహనాల ద్వారా స్టాకును పంపిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధిక లాభాల కోసమే ఈ ప్రయాస అని, తాము ఎంతో నష్టపోతున్నామని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విక్రయాలు జరిగాల్సిన షాపులో అమ్మకం కంటే బెల్టు షాపులకు విక్రయించడం ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. మందు బాబుల జేబులకు చిల్లు మద్యం ప్రియుల జేబుకి చిల్లు పడుతుంది. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా కూలీ పని, ఇతరత్రా శారీరక శ్రమ చేసే వారు కొనుగోలు చేసే మద్యం లైసెన్స్ షాపులలో దొరకకపోవడంతో వారు బెల్టుషాపులను ఆశ్రయిస్తున్నారు. ఇలా బెల్టు షాపులలో కొనుగోలు చేయడం ద్వారా వారి జేబులకు చిల్లు పడుతుంది. ఎందుకంటే ఎమ్మార్పీ ల కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో బెల్టుషాపులు నడుస్తున్నాయి.