A place where you need to follow for what happening in world cup

అభిమానులతో లైవ్‌?లో ముచ్చటించిన చిరు

0

హైదరాబాద్‌, జనవరి 24,
మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్‌ బాబీ రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్‌ అందుకుంది. అంతేకాకుండా రికార్డ్‌ వసూళ్లు రాబట్టింది. అన్నయ్య లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత మాస్‌ మాహారాజా రవితేజ, చిరు కలిసి నటించిన ఈ మాస్‌ ఎంటర్టైనర్‌ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ఈ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..యూఎస్‌?లోనూ విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా వాల్తేరు వీరయ్య సక్సెస్‌?లో భాగంగా అభిమానులతో లైవ్‌?లో ముచ్చటించారు చిరు.ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించడంతో అభిమానులు ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య విన్నర్‌ అంటూ థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ నినదాలు చేస్తూ ఈ సక్సెస్‌ ను గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని అభిమానులతో ఆన్‌?లైన్‌?లోనే చిరు ముచ్చటించారు. మెగాస్టార్‌ లైవ్‌?లో ఉండగానే.. కేక్‌ కట్‌ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. లాస్‌ ఏంజెల్స్‌, ఫీనిక్స్‌, డెన్వర్‌, షికాగో, డాలస్‌, హ్యూస్టన్‌ సహా 27 అమెరికన్‌ సిటీస్‌ ప్రాంతాలకు చెందిన అభిమానులతో చిరు లైవ్‌ లో ముచ్చటించారు.ఈ క్రమంలోనే చిరును చూసి సంతోషంతో అభిమానులు కేకలు వేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఫ్యాన్స్‌ ప్రేమ చూసి మెగాస్టార్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం చిరు.. డైరెక్టర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో భోళా శంకర్‌ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది.

Leave A Reply

Your email address will not be published.