Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రేమ, సహజీవనం, పెళ్లి…

0

హైదరాబాద్, ఫిబ్రవరి 123,
ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పరిచయం ఏర్పడంది. అది కాస్తా తర్వాత ప్రేమగా, సహజీవనంగా మారింది. చాలా రోజుల పాటు వీరిద్దరూ కలిసే ఉన్నారు. ఇంతలో ఆ యువతికి కుటుంబ సభ్యులు మరొకరితో పెళ్లి చేసి దుబాయి పంపించారు. మాజీ ప్రియుడి కోరిక మేరకు మళ్లీ హైదరాబాద్ తిరిగొచ్చేసింది. కొంత కాలం అతడు ఆమెతో సవ్యంగానే ఉన్నప్పటికీ.. ఆమెకు తెలియకుండానే వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఇదే విషయం గుర్తించిన సదరు మహిళ ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ బోరబంజ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల ఓ యువతి టెలీకాలర్ గా పనిచేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఐధేళ్ల క్రితం మహారాష్ట్ర జలగావ్ కు చెందిన 28 ఏళ్ల సైఫ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నగరానికి వచ్చిన సైఫ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో సహజీవనం చేశాడు.

ఈ క్రమంలోనే 2020లో యువతికి ఆమె కుటుంబ సభ్యులు మరో సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసిచ్చారు. ఆపై ఆమెను దుబాయ్ కి కూడా పంపారు. భర్తకు విడాకులిచ్చి రావాలని, తాను పెళ్లి చేసుకుంటానని సైఫ్ మళ్లీ మాయ మాటలతో మభ్య పెట్టాడు. అది నమ్మిన యువతి భర్తకు విడాకులు ఇచ్చి నగరానికి వచ్చింది. ఆమెకు గర్భస్రావం సైతం చేయించాడు. కొంతకాలం కలిసి ఉండి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈనెల 22వ తేదీన వేరొక యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. విషయం గుర్తించిన ప్రేమికురాలు సైఫ్ స్వగ్రామానికి వెళ్లి నిలదీసింది. సైఫ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు యువతిని అంగీకరించకపోవడంతో తిరిగొచ్చి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు కేసు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచలాపురం గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన స్వప్న అనే యువతితో కాలేజీలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారి మధ్య ప్రేమ పెరిగి ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. పెళ్లి వరకు మాటలు వచ్చాయి. పెళ్లికి ఓకే అని చెప్పాడు కృష్ణ.  ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని స్వప్న అడిగినప్పుడల్లా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పుతూ కాలయాపన చేశాడు. చివరికి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదని, కొద్దిరోజులు ఆగని చెప్పడంతో ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులు కాలం గడిచింది. ఇటీవల కృష్ణ యువతికి ఫోన్ చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు.

నేను కొన్ని రోజులు తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్న కదా.. ఇలా ఎందుకు చేశావు అని వేధింపులు మొదలుపెట్టాడు. నువ్వు నాతో దిగిన ఫొటోలు ఉన్నాయి. నువ్వు మీ ఆయనతో కలిసి ఆ ఫొటోలు వీడియోలు బయటపెడతా అని బెదిరించాడు. దీంతో స్వప్న మళ్లీ అతడి మాయమాటలు నమ్మి భర్తతో విడాకులకు కూడా వెళ్లింది. ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచింది.  తీరా ఇప్పుడు పెళ్లి మాట ఎత్తేసరికి కృష్ణ ఉలుకు పలుకు లేదని బాధిత యువతి ఆరోపిస్తుంది. అతడు వేరే అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోవడంతో యువతి చివరికి పోలీస్ స్టేషన్ వెళ్లింది. పెద్ద మనుషుల దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకుంది.  అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తన భవిష్యత్తు ప్రశ్నానార్థకంగాగా మారిందని కృష్ణ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి స్వప్న తనకు న్యాయం కావాలని పోరాటం చేస్తోంది. ప్రేమ పేరిట మోసపోయిన ఆ యువతి తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie