రంగారెడ్డి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారి గా బంగారం స్వాధీనం అయింది. 8 కోట్ల విలువ చేసే 14.4 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసారు. సుడాన్ నుండి హైదరాబాద్ చేరుకున్న 23 మంది సూడాన్ జాతీయుల పై అనుమానం కలగడం తో వారిని క్షుణ్ణంగా పరిశీలించారు. వారి లో 4 గురి వద్ద అక్రమ బంగారం గుర్తించారు. బంగారాన్ని వివిధ చోట్లో దాచి తరలించే యత్నం చేసినట్లు గుర్తించారు.కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి గ్రూప్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు 23 మంది మహిళా ప్రయాణీకులు చేరుకున్నారు.
కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని షూ, పాదాల కింద, బట్టల మద్య లో దాచి తరలించే యత్నం చేసారు. కేవలం బంగారాన్ని తరలించడానికే హైదరాబాద్ వారంతా చేరుకున్నారు. కస్టమ్స్ అధికారులను కన్ఫ్యూజ్ చేసి బంగారాన్ని తరలించే యత్నం రట్టయింది. కస్టమ్స్ బృందం చాకచక్యంగా వ్యవహరించి బంగారం బండారం బయట పెట్టింది.