రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డిని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పరామర్శించారు. హైదరాబాదులోనీ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్నను పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు.