Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

Revanth Reddy should change his language Minister Niranjan Reddy

0

బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ భానుప్రసాద్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, తాతా మధు తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ కరంటు మీద చేసిన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ కావడంతో రేవంత్ ప్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్ధం లేకుండా మాట్లాడుతున్నాడు. అంశాలవారీగా సైద్దాంతిక ప్రాతిపదికన ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. సందర్భోచితంగా సహేతుకమైన విమర్శలు చేయవచ్చు. ప్రజలు, సమాజం విజ్ఞత కలిగి ఉంటారన్న విషయం గుర్తెరగాలి. రెండో సారి ప్రజలు ఆమోదించిన ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దుర్భాషలాడడం సహేతుకం కాదు.. రేవంత్ వ్యాఖ్యలను వాళ్ల పార్టీ వారే పార్టీని పెంచడానికా ? తుంచడానికి ? అని ఆలోచిస్తున్నారని అన్నారు.

కేసీఆర్ ను విమర్శించినంత మాత్రాన రేవంత్ పెద్దవాడు అయిపోడు. అడ్డగోలుగా మాట్లాడితే ఏదో అయిపోతానని ఆపోహా ఉన్నట్లుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చంద్రబాబు చర్యలలో నీ పాత్ర అబద్దమా ? టీవీలలో పట్టుబడింది నిజమే కదా ? నీ చర్యలను నీ పార్టీ శ్రేణులే హర్షించడం లేదు. పరిమితులకు లోబడి హుందాగా మాట్లాడితే అర్ధవతంగా ఉంటుంది. ప్రభుత్వం ఎంచుకున్న పనులలో ప్రాధాన్యతా క్రమంలో కొన్ని మిస్ అవుతాయి. వాటిని చేసినట్లు మేము చెప్పుకోవడం లేదు. సమయాన్ని బట్టి వాటిని పూర్తిచేస్తాం. అభూత కల్పనలతో కూడిన ఆధారం లేని ఆరోపణలు తాత్కాలికంగా సంచలనం కావచ్చు కానీ కాలక్రమంలో అవి నిలబడవు. సచివాలయం కడితే అందులో నేలమాళిగలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఎదుటివారిని నోటికొచ్చినట్లు దూషించడం పద్దతి కాదు. భాష మార్చు కోవాలని హెచ్చరిస్తున్నామని అన్నారు.

86 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తారు .. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడే తీరు ఇదేనా ? వ్యక్తులను తూలనాడడం ఇదేం పద్దతి ? ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది. రేవంత్ తన చర్యలు, నోటి దురుసు ద్వారా అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బతికుండగానే పిండం పెడుతున్నాడు. ఆ పార్టీని బతికించుకోవాలి అని ఆ పార్టీ కోసం నిలబడే వాళ్లు గమనించుకోవాలి. ఆలోచించాలి. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఆయనను సన్యాసం చేయమని ఎవరన్నా అడిగారా ? నువ్వే చెప్పావు. నువ్వే పాటించలేదు. నీవు మాట్లాడిన మాట మీద నువ్వు నిలబడలేదు. అందుకే నీ మాటలకు విలువలేదు. నీ సవాళ్లకే నీవు నిలువలేదు. అటువంటి నీతో చర్చకు రావాల్సిన అవసరం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు మా ప్రభుత్వంలోని ఎవరూ పాల్పడలేదు. ఒక పద్దతి ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie