కాంగ్రెస్, బీజేపీలకు మంత్రి తలసాని సవాల్
దమ్ముంటే వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. బుధవారం కాచిగూడలోని తుల్జా భవానీ ట్రస్టుకు వచ్చిన మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దమ్మున్న నేత అని కొనియాడారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అభ్యర్థులను ప్రకటించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు వివరించే ధైర్యం తమకుందన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరని, కాంగ్రెస్ పోరాటాలకే పరిమితం అయ్యిందని ఆయన విమర్శించారు.
Prev Post
Next Post