A place where you need to follow for what happening in world cup

HOT NEWS

ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి హౌస్ అరెస్టు

0

జగిత్యాల: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోనివెల్గటూర్ మండలం పాసిగాం లో ఇథనాల్ ప్రాజెక్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా  ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్న దృష్ట్యా ఆ గ్రామస్తులను కలేసేందుకు వెళ్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిని జగిత్యాల పట్టణ సిఐ రామచందర్ రావు అధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.జగిత్యాల ఇంట్లో నుండి గురువారం  పాసిగాం  కు వెళ్తుండగా జీవన్ రెడ్డి ని జగిత్యాల పోలీసులు బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు.అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురిలో సిఐ కోటేశ్వర్ అధ్వర్యంలో పోలీస్ లు హోస్ అరెస్ట్ చేశారు. పాసిగాం గ్రామంలో ఇథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయవద్దంటూ పాసిగాం గ్రామంతో పాటు చుట్టూ పక్కల గ్రామస్తులు కొద్దిరోజులుగా అందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను కలిసేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు అడ్లూరి లక్ష్మన్ కుమార్ లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఎమ్మెల్సీతో పాటు జగిత్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ , మైనారిటి సెల్ జిల్లా నాయకుడు మన్సూర్,మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు నేహల్ తదితరులను పొలీసులు జీవన్ రెడ్డి నివాసంలో గృహ నిర్బంధం చేశారు.రైతులకు మద్దతుగా పాసిగాం గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గృహ నిర్బంచగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల కాంగ్రెస్ నాయకులతో కలిసి జీవన్ రెడ్డి కి సంఘీభావం తెలిపారు. జీవన్ రెడ్డి కి సంఘీభావం తెలిపిన వారిలో అల్లూరి మహేందర్ రెడ్డి, పెరుమాండ్ల సత్యనారాయణ,తుపాకుల భజన్న, శ్రీకాంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రిజ్వన్ తదితరులున్నారు

Leave A Reply

Your email address will not be published.