కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఓ వానరం భక్తి పారవశ్యoలో మునిగిపోయింది. ఆలయ ఆవరణలోని కోనేరు వద్ద గల ఆంజనేయస్వామి విగ్రహం ముందు కూర్చున్న వానరం, అక్కడే ఉన్న దేవుని ఫోటోకి మొక్కుతూ నిమిషం పాటు అలాగే ఉంది. దాంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోతికి ఉన్న భక్తి పట్ల భక్తులు చర్చించుకున్నారు.