నెల్లూరు
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం లో కమిషనర్ హరిత అధ్వర్యంలో జరిగిన రివ్య్వూ మీటింగ్లో నెల్లూరు ఎంపి, రూరల్ నియోజక వర్గం ఇంఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.నగర్ మేయర్ లేకుండానే మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పాలక అధికారులు నెల్లూరు రూరల్ పరిధిలో అక్రమ కట్టడాల విషయంపై అనేక పిర్యాదులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఇవి వెళ్లి ఉన్నాయని తగిన చర్యలు తీసుకోవాలని ఆదాల సూచించారు.నగరం లో విచ్చల విడిగా వున్న అనుమతులు లేని లే అవుట్ లు పై పూర్తి వివరాలుతో కూడిన నివేదికను 2 రోజుల్లో తయారు చేసి తన వద్దకు రావాలని సూచించారు.
రోడ్లు, డ్రైన్ లు, లైట్లు లాంటి మౌఖిక వసతులు మరమ్మత్తులు,కొత్తగా ఏర్పాటు ను వెంటనే పూర్తి చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఒక డివిజన్ అభివృద్ధిలో కానీ పనుల్లో కానీ ఇతర వ్యక్తులు కానీ తల దూర్చరని తెలిపారు. ఈ సందర్భంగా శానిటేషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు.కార్పొరేటర్ల నుంచి వచ్చిన వివిధ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని నగర కమిషనర్ హరిత పేర్కొన్నారు.