Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పొంగులేటీ.. జూపల్లికి జాతీయ పార్టీల ఆఫర్లు

0

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఖమ్మం జిల్లా సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం కాంగ్రెస్ , బీజేపీ మంతనాలు జరుపుతున్నాయి. ఆయన కూడా ఈ నెలలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్ టీం వచ్చి ఆయనతో చర్చలు జరిపింది. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావును కూడా చేర్చుకోవడానికి చర్చలు ప్రారంభించారు. అనుచరులందరికీ టికెట్లు ఇస్తే కాంగ్రెస్లోకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తానని పొంగులేటి వారికి హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. బీజేపీ తాము ఇస్తామని కబురు పంపింది. ఇంకా పొంగులేటి నిర్ణయం తీసుకోలేదు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయాలంటే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవసరం అని కాంగ్రెస్ నమ్ముతోంది.   పార్టీలో చేరిక అంశంపై రాహుల్ టీం  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి సుదీర్ఘంగా చర్చించింది.  ఖమ్మం జిల్లాలో పొంగులేటికి ఉన్న గ్లామర్ ఆయనకున్న ఆర్ధిక బలం సామాజిక బలం అన్నీ కూడా కాంగ్రెస్ కు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు.

కొంతకాలంగా పొంగులేటి ఏ పార్టీకి వెళ్తారోనన్న చర్చ జరుగుతోంది. ఆయన బిజెపిలోకి వెళ్తారని ఓ ప్రచారం ఉంది. ఎందులోకి వెళ్లాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని తమ అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి చెబుతుననారు.   ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తనను బి.ఆర్.ఎస్. నాయకత్వం సస్పెండ్ చేసిన సమయంలో వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలోని మొత్తం 10 స్థానాల్లో ఏ ఒక్కదాంట్లోనూ బి.ఆర్.ఎస్. అభ్యర్ధి గెలిచే ప్రసక్తే లేదని పొంగులేటి సవాల్ విసిరారు. ఒక్కరంటే ఒక్క బి.ఆర్.ఎస్. అభ్యర్ధి కూడా ఖమ్మం నుండి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి బలం తెలుసు కాబట్టే రాహుల్ గాంధీ టీం ఆయన్ను బిజెపి తన్నుకుపోకుండా ముందస్తుగా జాగ్రత్త పడింది. ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం నుండి భట్టి విక్రమార్క భద్రాచలం నుండి సొదెం వీరయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే సిటింగ్ స్థానాలైన మధిర భద్రాచలం మినహా మిగతా 8 నియోజకవర్గాల్లో పొంగులేటి చెప్పిన వారికే టికెట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.  బిజెపికి బలం లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లడం కన్నా కాంగ్రెస్ లో చేరితేనే బెటరని పొంగులేటి శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు.   ఖమ్మం జిల్లా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోన్న పొంగులేటి ఖమ్మంలో సత్తా చాటగలిగితే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.

ఇంకో అనుకూల అంశం ఏంటంటే ఖమ్మంలో పొంగులేటి రాకను వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు కూడా ఎవరూ లేరు. అది అసలు సిసలు అడ్వాంటేజ్. ఒక వేళ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోతే పొంగులేటి ద్వారానే మరో బి.ఆర్.ఎస్. బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావును కూడా కాంగ్రెస్ లో చేర్పించాలన్నది హస్తం నేతల వ్యూహంగా చెబుతున్నారు. పొంగులేటితో పాటు  జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ నుంచి జూపల్లికి ఒత్తిడి వస్తోంది. కేసీఆర్ను ఓడించాలన్న లక్ష్యం కాంగ్రెస్లో చేరితేనే నెరవేరుతుందని, ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హస్తం నేతలు సూచిస్తున్నారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలే జూపల్లితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీకి చెందిన ఢిల్లీ నేతలు సైతం వీరిద్దరిని తమ పార్టీలో చేర్చుకోవడంపై సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్లద్దరు ఏ పార్టీలో చేరితే రానున్న రోజుల్లో ఆ పార్టీలోకే మిగతా నేతల వలసలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. జాతీయ పార్టీలు రెండూ ఈ ఇద్దరు నేతలకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూంటే.. బీఆర్ఎస్.. వీరికి కనీసం టిక్కెట్లు ఎందుకు కేటాయించడానికి సిద్దపడలేదన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గామారింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie