A place where you need to follow for what happening in world cup

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్దిగా మేరిగా మురళీధర్

0

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి  పార్టీకి విధేయులుగా ఉన్న  మేరిగా మురళీధర్ కష్టానికిదగ్గ ఫలితం లభించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడుగా,గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త బాధ్యతలు చేపట్టి పార్టీ కోసం కోట్లాది రూపాయలుఖర్చు చేసి కష్టకాలంలో జగనన్న వెంట నడిచారు.
2014, 2019 లో వైసీపీ టికెట్ తృటిలో చేజారింది.అయినా పార్టీ పై విమర్శలు చేయలేదు పార్టీ ఉన్నతికి కృషి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ గా వైసీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.కానీ దురదృష్టం  రెండు తెలుగు రాష్ట్రాలతో ఆ పదవీ ముడి పడిన కారణంగా  ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. అయినా నిరుత్సాహం చెందలేదు.గూడూరు లోనే ఉంటూ పార్టీకి సేవలు చేస్తూ వైసీపీనాయకులు,కార్యకర్తలు,అభిమానులకు అందుబాటులో ఉంటూ పార్టీకి విధేయుడు గా ఉన్నారు.ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో మేరిగా మురళీధర్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల వైకాపా అభ్యర్దిగా ప్రకటించారు.

ఆ తరువాత ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంభందించి వైసీపి అభ్యర్ధి మేరుగ మురళి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన మేరుగ మురళి రిటర్నింగ్ అధికారి అయిన జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ కు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
మేరిగా మురళీధర్ తో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారు.శుక్రవారం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ,ఎన్నికల అధికారులుతీపి  నామినేషన్ పరిశీలిన చేపట్టారు.ఈ పరిశీలనలో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ ను. తిర స్కరించారు.దింతో
మేరుగ మురళీధర్  ఎమ్మెల్సీ గాఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.త్వరలోనే అధికారికంగా మేరిగా మురళీధర్ ను ఉమ్మడి  నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల శాసన మండలిసభ్యులు గా ప్రకటించనున్నారు

Leave A Reply

Your email address will not be published.