Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

 ఇక ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులు

0

ముంబై, ఫిబ్రవరి 17:దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని ప్రారంభించింది. తొలుత, పైలట్ ప్రాజెక్ట్‌ ఈ ఫెసిలటీని ప్రారంభించింది.  క్రంచ్‌ఫిష్‌  కంపెనీతో కలిసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ప్రయోగం చేస్తోంది. ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్‌ సొల్యూషన్స్‌లో భాగంగా వ్యాపారులు & వినియోగదార్ల కోసం ఈ సౌకర్యాన్ని తీసుకు వచ్చింది. ఆర్‌బీఐ రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ప్రోగ్రాం కింద ఈ ఆఫ్‌లైన్ పే ప్రారంభమైంది.మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకపోయినా, హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ ఆఫ్‌లైన్ పే కింద అటు కస్టమర్‌లు & ఇటు వ్యాపారులు చెల్లింపులు చేయగలరు & చెల్లింపులను స్వీకరించగలరు. మన దేశంలో ఆఫ్‌లైన్ మోడ్‌లో డిజిటల్ చెల్లింపుల పరిష్కారాన్ని ప్రారంభించిన మొదటి బ్యాంక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ ఇప్పుడు అవతరించింది.

మొబైల్ నెట్‌వర్క్ తక్కువగా ఉన్నప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ ఆఫ్‌లైన్ పే సౌకర్యంతో ఇబ్బంది ఉండదు. మొబైల్‌ నెట్‌వర్క్‌ బలహీనంగా ఉండే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోనూ ఈ విధానం ద్వారా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.మొబైల్ నెట్‌వర్క్‌ రద్దీ ఎక్కువగా ఉండే నగర ప్రాంతాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. భారీ పబ్లిక్ ఈవెంట్‌లు, ట్రేడ్ ఫెయిర్స్‌, ఎగ్జిబిషన్లలోనూ నగదు రహిత చెల్లింపులను ఆఫ్‌లైన్‌ పే కింద సులభంగా చేయవచ్చు. అదే విధంగా, సిగ్నల్స్‌ వీక్‌గా ఉండే భూగర్భ మెట్రో స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, నెట్‌వర్క్ బ్లైండ్ స్పాట్‌లు అయిన రిటైల్ స్టోర్లలో లావాదేవీలు సులభంగా చేయవచ్చు. విమానాలు, రైళ్లు లేదా నౌకల్లో కూడా నెట్‌వర్క్ లేకుండా చెల్లింపు చేయవచ్చు.

ఈ రకమైన చెల్లింపుల విధానంలో, ఆర్‌బీఐ  రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ప్రోగ్రాం కింద పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన మొదటి డిజిటల్ పేమెంట్స్‌ సొల్యూషన్‌ ఇది.    ఆర్‌బీఐ   శాండ్‌బాక్స్ ప్రోగ్రాం కింద, బ్యాంక్‌ రెగ్యులేటర్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ మీద హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ గట్టిగా పని చేస్తోంది. ఆర్‌బీఐ  ద్వారా, క్రంచ్ ఫిష్ భాగస్వామ్యంతో 2022 సెప్టెంబర్ నెలలో హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్‌కు చెందిన ఈ ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ అప్లికేషన్‌ను డెవలప్‌ చేశారు. ఆర్‌బీఐ  నుంచి ఇది గ్రీన్ సిగ్నల్ పొందింది, తద్వారా దీనిని రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. క్రంచ్ ఫిష్ డిజిటల్ క్యాష్ AB అనేది నాస్‌డాక్‌లో లిస్టయిన క్రంచ్ ఫిష్ ABకి చెందిన అనుబంధ సంస్థ.     హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశంలో ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie