A place where you need to follow for what happening in world cup

డబుల్ డెక్కర్ బస్సులు కు లేని స్పందన

0

హైదరాబాద్, ఏప్రిల్ 20:టిజన్లను బాగా ఆకర్షిస్తాయనుకున్న డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో ఖాళీగా తిరుగుతున్నాయి. అసలు ఈ బస్సులు ఉన్నాయా? లేదా? ఒకవేళ ఉంటే ఏయే రూట్లలో తిరుగుతున్నాయ్‌? వంటి సమాచారం నగర వాసులకు కరువైపోయింది. దీంతో వీటికి ఆదరణ కరువైపోయింది. ట్విన్‌ సిటీల్లో ఎన్నో ఏళ్ల క్రితమే డబుల్ డెక్కర్ బస్సులు సిటీకి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. డబుల్డెక్కర్‌ బస్సుల్లో కూర్చొని సిటీ అందాలు చూసేందుకు నగర వాసులు అప్పట్లో అమితాసక్తి కనబరిచేవారు. సిటీలో డబుల్డెక్కర్బస్సులను తిరిగి ప్రవేశపెడితే బాగుంటుందని కొందరు నెటిజన్స్నుంచి మంత్రి కేటీఆర్కు రిక్వెస్ట్‌లు వెళ్లడంతో ఈ బస్సులను మళ్లీ రోడ్డెక్కించాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి తెలిపారు.

ఈ ప్రతిపాదనపై లెక్కలు వేసుకున్న అధికారులు ప్రస్తుత సిటీ రూట్లలో వాటిని తిప్పడం సాధ్యం కాదని, బస్సుల ధర కూడా ఎక్కువని తేల్చారు. దాంతో ఈ బాధ్యత హెచ్‌ఎండీఏ తీసుకుంది. ఒక్కో డబుల్డెక్కర్‌ను దాదాపు రూ.2 కోట్లు పెట్టి మొత్తం 6 బస్సులను రూ.12 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. ఒక్కో బస్‌మెయింటెనెన్స్కోసం నెలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తోంది.ముందుగా రెండు బస్సులను నడిపిన హెచ్‌ఎండీఏ తర్వాత మరో నాలుగింటిని కొన్నది. నెక్లెస్రోడ్, ఎన్టీఆర్మార్గ్ఏరియాల్లో గత రెండు నెలల కిందట సర్వీసులను ప్రారంభించింది కూడా. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రతి బస్సును రెండు ట్రిప్పులు తిప్పుతున్నారు.

తొలుత టికెట్లు తీసుకోకుండా జాయ్ రైడ్పేరిట ఫ్రీగానే తిప్పుతున్నప్పటికీ.. ప్రచారం లేకపోవడంలో ఈ విషయం తెలియని జనాలు వాటిని చూసి సంబురపడుతున్నారే తప్ప ఏ ఒక్కరూ ఎక్కడం లేదు. అటు అధికారుల్లోనూ ఈ బస్సుల రూట్మ్యాప్, స్టేజీల విషయంలోనూ క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ట్రయల్రన్చేస్తున్నామంటూ తప్పించుకుంటున్నారు. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన డబుల్డెక్కర్‌ బస్సులు ఉసూరుమంటూ రోడ్లపై తిరుగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.