నిజామాబాద్ జనవరి 28: జిల్లా కేంద్రంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగలు తగిలాయి. కంటేశ్వర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఆధ్వర్యంలో కేటీఆర్ వాహనాల ఎదుట నిరసనకు దిగారు.
పోలీసుల రక్షణ వలయాన్ని దాటుకుని వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగానే ప్రతిపక్ష, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.