పోలీసులు అదుపులో నలుగురు
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి క్షుద్ర పూజలు కలకలం రేపాయి. టేకులపల్లి-చౌటపల్లి గ్రామాల సరిహద్దుల్లో లంకెబిందెలు ఉన్నాయని క్షుద్రపూజలు జరిపినట్లు సమాచారం.
గుప్తనిధుల కోసం వచ్చిన పూజరుల వెంట ఒక చిన్న బాలుడు ఉండటంతో నరబలి ఇవ్వడానికే తెచ్చారని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది మంది సభ్యులు గుప్తనిధుల కొరకు వచ్చారు. వీరంతా బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులు వచ్చినవారిలో నలుగురు పరారు అయ్యారు. మరో నలుగుర్ని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.