Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కవ్వింపులతో  పార్టీలు.

0

ఎన్నికలు ఏవైనా పార్టీలకు కీలకమే. నెగ్గడానికి అనేక ఎత్తుగడలు వేస్తాయి. కానీ.. ఇటీవల కాలంలో ఎలక్షన్స్‌ అంటే అర్థమే మారిపోయింది. గతానికి ఇప్పటికి పోలికే లేదు. గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికలే నిదర్శనం. ఇక పార్టీల మధ్య అసలు సిసలు పోరంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలే. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వాటికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్న వైసీపీ.. విపక్ష టీడీపీ తమ అమ్ముల పొదిలోని అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాయి.

 

అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో కొత్త చరిత్ర సృష్టించాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23 స్థానాల్లో నెగ్గి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంటే.. వైసీపీ అంచనాలను మించి 151 సీట్లలో నెగ్గి రికార్డు నెలకొల్పింది. వార్‌ వన్‌సైడ్‌ అన్నట్టుగా ఫలితాలు వచ్చాయి. చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయింది. కళ్ల ముందు మళ్లీ ఎన్నికల చిత్రం కనిపిస్తోంది. సమయం లేదు మిత్రమా అన్నట్టు దూకుడు ప్రదర్శిస్తున్నాయి వైసీపీ, టీడీపీ.ఇటీవల కాలంలో వివిధ సభల్లో పాల్గొంటున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే.. విపక్షాలపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు.

 

చంద్రబాబు అండ్‌ కో అంటూ కన్నెర్ర చేస్తున్నారు కూడా. రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్య వార్‌ జరుగుతోందని చెబుతూనే.. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో దేవుడితోపాటు జనమే తనకు అండగా ఉంటారని గట్టి ధీమాతో ప్రకటనలు చేస్తున్నారు.ఇక మహానాడు వేదికగా రెండురోజుల పాటు ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వచ్చే ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించారు. ఏకంగా సమరశంఖమే పూరించారు. కౌరవ సభను గౌరవ సభగా మారుస్తానని కామెంట్ చేశారు బాబు.

 

వైసీపీ, టీడీపీలు వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి అని చెప్పడానికి వాళ్ల కామెంట్సే అద్దం పడుతున్నాయి. తగ్గేదే లేదన్నట్టుగా మాటలతో కవ్వింపులకు దిగుతున్నారు. ఏకంగా ఎన్నికలను యుద్ధంగా పరిగణిస్తూ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తులు.. ఎత్తులు.. జిత్తులు.. కుయుక్తులు రాజకీయ వాతావరణాన్ని ఎలాంటి మలుపు తిప్పుతాయో కానీ.. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ మాటలు కోటలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి


 

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie