పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర ద్వారా పార్టీ నేతలు, కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అయితే వారాహి యాత్ర ప్రారంభం అయిన తర్వాత మొదటి మూడు విడతల యాత్రలకు మధ్యలో పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. కేవలం బ్రో సినిమా రిలీజ్ సమయంలో మాత్రం కాస్త విరామం తీసుకున్నారు. కానీ ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమా ప్రాజెక్టులతో అటు యాత్రకు ఇటు సినిమాలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఉంది. అప్పటినుంచి పన్నెండో తేదీ వరకూ షూటింగ్‌లోనే ఉంటారని తెలిసింది. ఇక సెప్టెంబర్ మూడో వారం నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. దానికి తగ్గట్లుగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: ఆపరేషన్ చిరుత….
డిసెంబర్ చివరి వరకూ పవన్ కళ్యాణ్ కు సినిమా షూటింగ్‌లు ఉన్నాయి.దీంతో ఈ నాలుగు నెలలు ప్రతి నెలా సగం రోజులు సినిమా షూటింగ్‌కు, మరో సగం రోజులు పార్టీకి కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. నెలలో సగం రోజులు పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి సారించనున్నట్లు పేర్కొంటున్నారు పార్టీ నేతలు.. ఇదే సమయంలో వారాహి యాత్రతో పాటు పార్టీ జాయినింగ్స్, నియోజకవర్గాల వారీగా సమీక్షలపైనా దృష్టి పెట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇక జనవరి నుంచి సినిమాలకు పూర్తి దూరంగా ఉంటూ కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడతారట పవన్ కళ్యాణ్. ఎన్నికల వరకూ మొత్తం 100 రోజుల పాటు 100 సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట.
వారాహి యాత్రలో కవర్ కాని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనవరి నుంచి పవన్ బహిరంగ సభలు నిర్వహించేలా రూట్ మ్యాప్ సిద్దం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మూడు విడతల వారాహి యాత్ర అనంతరం.. కేవలం కొన్ని ప్రాంతాలకే పవన్ యాత్ర పరిమిత మవుతుందని.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉండవని రాజకీయంగా విమర్శలు వచ్చాయి. కానీ పవన్ కల్యాణ్ తాజా షెడ్యూల్ ప్రకారం.. అన్ని జిల్లాల్లో పర్యటనలు ఉంటాయంటున్నారు పార్టీ నేతలు.. ముఖ్యంగా పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో ముందుగా పర్యటన చేయడం.. అక్కడ ఖచ్చితంగా విజయం సాధించాలని ముందుకెళ్తున్నారు. ఇక జనవరి నుంచి మొత్తం 175 నియోజకవర్గాల్లో పర్యటనలు,100 బహిరంగ సభల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలు కవర్ చేయాలనుకుంటున్నారు.
అయితే పొత్తులపై స్పష్టత వచ్చినా.. రాకున్నా ఈలోగానే మెజార్టీ స్థానాలు కవర్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ వారాహి యాత్ర కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉండేలా జనసేన పార్టీ అధినేత కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొన్నేళ్లుగా సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డిసెంబర్ దాకా ఆయనకు హెక్టిక్ షెడ్యూల్ ఉండబోతోందని తెలుస్తోందిజనసేనాని పవన్ వారాహి విజయయాత్ర ఇప్పటికే మూడు విడతలు ముగిసింది.
Also Read: సీక్రెట్ఫ్రెండ్స్!
ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటించారు. అయితే తర్వాతి విడత గురించి తాజాగా అప్డేట్ వచ్చింది.. ఇక పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ‘ఓజీ’ సినిమా మాత్రమే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అటు మరో సినిమా ‘హరిహర వీరమల్లు’ నుంచి అప్డేట్ వచ్చి చాలా కాలం అయింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ది కూడా అదే పరిస్థితి. మరి ఇంతటి టైట్ ప్యాక్డ్ షెడ్యూల్ లో ఎన్నికలు వచ్చేలోగా ఈ సినిమాల షూటింగ్స్ ని పవన్ కల్యాణ్ ఏ మేరకు పూర్తి చేస్తారనేది ఆసక్తిగా మారింది.