A place where you need to follow for what happening in world cup

పాయల్ మరీ ఇంత బోల్డ్‌గానా?

payal rajput too bold in sailaja movie

0

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మంగళవారం’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, ‘A’ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు ఈ రోజు తెలిపారు. సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘ఆర్ఎక్స్ 100’తో అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యారు. నాయికగా తెలుగులో పాయల్ రాజ్‌పుత్ తొలి చిత్రమది. తెలుగు తెరకు ఆమెను కథానాయికగా పరిచయం చేశారు. ఆ సినిమా తర్వాత అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కలయికలో వస్తున్న చిత్రమిది. ‘మంగళవారం’ సినిమాలో శైలజ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తెలిపారు. ఆ లుక్ చూస్తే… పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు.

payal rajput too bold in sailaja movie

పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ”గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది” అని అన్నారు.

నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ”అజయ్ భూపతి గారు దర్శకత్వం వహించిన ‘ఆర్ఎక్స్ 100’లో ఇందు పాత్ర ప్రేక్షకులకు ఎలా గుర్తు ఉండిపోతుందో, ఇప్పుడీ ‘మంగళవారం’లో శైలజ పాత్ర కూడా అలాగే గుర్తు ఉంటుంది. ఇప్పటికి 75 రోజులు షూటింగ్ చేశాం. ఎక్కువ శాతం నైట్ షూట్స్ ఉన్నాయి. వచ్చే నెలలో ఆఖరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. టెక్నికల్ పరంగా సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు” అని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.