ఈ నెల14వ తేది నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శన భాగ్యన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. తిరుపతి స్థానిక కపిలేశ్వర ఆలయంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పునఃప్రతిష్ట చేయడంతో పాటు జిర్నోధారణ,అష్ట బంధ మహ సంప్రోక్షణ కార్యక్రమంలో టిటిడి పాలక మండలి బోర్డ్ సభ్యులు పోకల అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మూడు ఆఘమాలు కలిసిన మహ పుణ్యక్షేత్రం తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయం అన్నారు. శైవ,పాంచరాత్ర,వైఖానస అఘమాలు కలిసిన ఈ ధివ్య క్షేత్రంలో శిధిలావస్థలో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ ఆలయాన్ని పునః నిర్మాణం చేసి ఈ నెల 11 వ తేది నుండి 14 వ తేది వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తునట్టు తెలిపారు.ఇక్కడ ఉన్నటువంటి ఈ లక్ష్మి నరసింహ ఆలయం పూర్తిగా శిధిలావస్థలో ఉండటాన్ని గమనించి ఆ ఆలయాన్ని పునః నిర్మించాలని కొంత మంది భక్తులు తన దృష్టికి తీసుకురావడంతో సుమారు 70 లక్షలు శ్రీవాణి నిధులతో ఆలయాన్ని సుదరంగా తీర్చి దిద్దడం జరిగిందన్నారు.
ఆస్తుల విభజనపై ఏపీ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంలో విచారణ.
అందుకు సహకరించిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి అదేవిధంగా టిటిడి ఈఓ ధర్మారెడ్డికి,ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డికి జేఇఓలు వీర బ్రహ్మం, సదాభార్గవికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏ ఈ ఓ పార్థ సారధి, సూపర్డెంట్ భూమాపతి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు రిత్వికులు పండితులు పాల్గొన్నారు