A place where you need to follow for what happening in world cup

లోకేష్ యువగళం పాదయాత్ర పై పోలీసుల ఉక్కుపాదం

0

తిరుపతి ఫిబ్రవరి 16:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు వెళ్తున్న మార్గంలో టీడీపీ శ్రేణులు కట్టిన జెండాలు బ్యానర్లను పోలీసులు స్వయంగా తొలగించి.. పోలీసు వాహనాల్లో తరలిస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తూ.. కేసులు పెడతాం అంటూ బెదిరిస్తున్నారు.సత్యవేడు నియోజకవర్గం, తిమ్మ సముద్రం, రాగి కుంట, కొత్తూరు, పివి కండ్రిగ గ్రామాల్లో ఏర్పాటు చేసిన జెండాలు, బ్యానర్లు తొలగించి పోలీసు వాహనాల్లో తరలించారు. దీంతో రైతులు పోలీసులను నిలదీశారు.

శ్రీకాళహస్తి మొదలు ఎక్కడబడితే అక్కడ బియ్యపు మధు ఫీక్సీలు కట్టి ఉన్నా ఎందుకు తీయలేదు అని రైతులు ప్రశ్నించారు. మొదట వాటిని తీసి ఆ తర్వాత రావాలని.. అప్పుడు తామే స్వచ్చందంగా జెండాలను తిస్తామని పోలీసులకు రైతులు చెప్పారు. రైతుల చైతన్యంతో వెనక్కు తగ్గిన పోలీసులు.. జెండాలు తిరిగి వెనక్కి ఇచ్చారు. కాగా డ్రోన్‌తో సహా లోకేష్ పాదయాత్రను వెయ్యి మంది పోలీసులు, 30 వాహనాల్లో 20 మంది ఎస్సైలు, 10 మంది సిఐలు, 6 గురు డీఎస్పీలు అనుసరిస్తున్నారు.

కాగా లోకేష్ యువగళం పాదయాత్ర 21వ రోజు గురువారం కొనసాగుతోంది. ఇవాళ తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమైంది. రాయపేడులో యువతీయువకులతో లోకేష్‌ సమావేశం అయ్యారు. అనంతరం పాదయాత్ర ప్రారంభమయింది. ఇప్పటి వరకు 261 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.కాగా లోకేష్ నిన్న 20వ రోజు పాదయాత్రను కీలపూడి విడిది కేంద్రం నుంచి ప్రారంభించారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతూ తన పాదయాత్రలో ముందుకు వెళ్ళారు.

ఈ సందర్భంగా ఎస్సీ సామాజికవర్గం యువతతో లోకేష్ సమావేశమయ్యారు. వారు తమ సమస్యలను యువనేతకు విన్నవించుకున్నారు. చీర, గాజులు ఇచ్చేందుకు వెళ్లిన దళిత మహిళలను దారుణంగా కొట్టారని, కేసులు పెట్టి జైల్లో పెట్టారని లోకేష్ మండిపడ్డారు. రాజధాని విషయంలో జగన్ మళ్ళీ మోసం మొదలుపెట్టారన్నారు. కర్నూలు అమరావతి కి మోసం చేసినట్టే, విశాఖ కు మోసం చేస్తారని అన్నారు. జగన్ దళితుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు ఇంటి పట్టాలు ఇస్తున్నట్టు చెప్పి తమిళనాడు వారికి ఇస్తున్నారంటూ లోకేష్‌కు దళితులు ఫిర్యాదు చేశారు. కాగా నిన్న 16.6 కిలోమీటర్ల మేర లోకేశ్ నడిచారు.

Leave A Reply

Your email address will not be published.