A place where you need to follow for what happening in world cup

ప్రధాని రేసులో ప్రియాంక  

0

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27:రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీకి పార్టీ కమాండ్ ఇవ్వాలని.. ఆ పార్టీలోని ఒక వర్గం చాలా కాలంగా కోరుతోంది. అటు పార్టీలో.. ఇటు బయటా.. ప్రియాంక గాంధీ కోసం బహిరంగంగా వాదిస్తున్న నాయకుడు ప్రమోద్ కృష్ణం. తాజాగా.. ఆయన తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. ప్రియాంక గాంధీ  ని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.రాయ్‌పూర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో సోనియా గాంధీ రిటైర్మెంట్‌ను ప్రకటించారు. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారు అయిన తర్వాత.. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు అయ్యింది. దీంతో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్‌కు ఛాన్స్ లేదు.

దీనిపై రాహుల్ హైకోర్టులో సవాల్ చేసినా.. ఇప్పటివరకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఒకవేళ కోర్టుల నుంచి ఉపశమనం లభించకపోతే.. ప్రియాంక గాంధీ ప్రధాన పాత్ర పోషిస్తారా అనే చర్చ జరుగుతోంది.ఇటు రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ స్థానంలో అయినా.. లేకపోతే.. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి అయినా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ 2019లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు కూడా.. ఆమె కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు.గత లోక్‌సభ ఎన్నికల తర్వాత.. రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో.. ప్రియాంక గాంధీకి అవకాశం వచ్చినట్లుంది. కానీ.. ఏం జరిగిందో తెలియదు.. ఇటీవల ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. అయినా.. ప్రియాంక మునుపటి లాగానే కాంగ్రెస్ వ్యూహరచనలో, వివాదాలను పరిష్కరించడంలో తెర వెనుక చురుగ్గా వ్యవహరిస్తున్నారు.రాహుల్ గాంధీ చిక్కుల్లో పడిన తర్వాత..

ప్రియాంక గాంధీకి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం ప్రియాంక గాంధీకి సంబంధించిన చర్చ అనవసరమని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీకి పార్టీలో ముఖ్యమైన పాత్ర ఉందని.. రాహుల్ గాంధీ అత్యున్నత నాయకుడని.. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడని స్పష్టం చేశారు.ప్రియాంక గాంధీ ప్రస్తుతం కర్ణాటకలో పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కొన్ని నెలల కిందట హిమాచల్ ప్రదేశ్‌లో ప్రచార బాధ్యతలు భుజాన ఎత్తుకున్నారు. ట్రబుల్‌ షూటర్‌గా.. స్టార్ క్యాంపెయినర్‌గా ప్రియాంక గాంధీ సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో.. ప్రియాంకను కాంగ్రెస్ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే.. తన సోదరుడు రాహుల్ కనుసన్నల్లోనే నడవక తప్పదని తెలుస్తోంది. 2024లో కూడా రాహుల్ విఫలమైతే.. ప్రియాంక గాంధీ పార్టీ సారథ్యం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.