A place where you need to follow for what happening in world cup

HOT NEWS

అక్రమ మైనింగ్ పై గప్ చిప్… ఎందుకని…

0

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం . శాసనసభాపతిగా ఉంటూనే ఫక్తు రాజకీయ విమర్శలు చేయడం ఆయన స్టైల్‌. అధికారులను మందలించడం, ప్రతిపక్షం మీద విరుచుకుపడటం లాంటి విషయాల్లో ఎక్కడా తగ్గరు తమ్మినేని. కానీ…అదంతా పైపై హంగామాయేనా అన్న అనుమానాలు ఇప్పుడు నియోజకవర్గంలో పెరుగుతున్నాయట. అక్రమ మైనింగ్‌ విషయంలో ఎందుకంత ఉదాసీనంగా ఉంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.పొందూరు, కృష్ణాపురం పరిసరాల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తమ్మినేని.

 

కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుంటే… ఎలా చూస్తూ ఊరుకున్నారని అధికారులను నిలదీశారాయన. అక్రమ క్వారీల సంగతి తేల్చమని మైనింగ్‌ శాఖ అధికారులకు ఒకరకంగా క్లాస్‌ తీసుకున్నారు. భారీగా అనుచరులను వెంటేసుకుని తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారాయన. సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తామని అప్పట్లో ప్రకటించారు కూడా. కానీ… సీన్ కట్ చేస్తే మేటర్‌ తుస్‌ మంది. విజిట్‌ చేసిన రోజు తప్ప తర్వాత దాని గురించి పట్టించుకున్నవాళ్ళు లేరట. ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా యధేచ్చగా క్వారీలు రన్ అవుతున్నాయట. దీంతో అడుగుతున్న వాళ్ళకు ఏం చెప్పాలో అర్ధంగాక మండలంలో తమ్మినేని అనుచరులుగా ముద్ర పడ్డనేతలు తెల్ల ముఖాలు వేస్తున్నారట.

 

అంతన్నారింతన్నారు.. అంతా ఏమైందని ఎవరైనా అడిగితే… ఎవ్వరి దగ్గరా సరైన సమాధానం లేదుకొన్ని విషయాల్లో అతి దూకుడు వ్యవహారాలు పార్టీ ఇమేజ్‌తోపాటు వ్యక్తిగతంగా తమ్మినేనికి కూడా నష్టం చేస్తున్నాయన్నది లోకల్‌ టాక్‌. గ్రావెల్ తవ్వకాలను క్షణాల్లో ఆపేయిస్తానంటూ నాడు చెప్పిన మాట నీటి మూటగానే మిగిలిపోయిందని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఉక్కుపాదం మోపుతానన్న వ్యక్తి నుంచి ఉలుకూ పలుకూ లేదేంటని కేడర్‌లో కూడా చర్చ జరుగుతోందట. రాపాక , కృష్ణాపురం, ఇల్లయ్యగారిపేట, రెడ్డిపేట, వి.ఆర్. గూడెం , వావిలపల్లి పేటల్లో అక్రమ క్వారియింగ్, గ్రావెల్ త్రవ్వకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. ఓ యువకుడి మృతితో అర్ధరాత్రి తవ్వకాల వ్యవహారం బయటపడింది.

రఘురామ కస్టొడియల్ టార్చర్….

పోలీస్ , మైనింగ్ , రెవెన్యూ అధికారులతో పాటు వైసీపీ నేతలంతా ఆ ప్రాంతాన్ని చుట్టివచ్చారు. ఉపేక్షించబోమని హెచ్చరించారు. కానీ మాటలు కోటలు దాటాయి తప్ప చేతలు గడప దాటడం లేదన్నది లోకల్‌ టాక్‌. స్థానిక ఎమ్మెల్యేగా తమ్మినేని అటు బాధితుడి కుటుంబానికి గాని, ఇటు ప్రభుత్వ ఖజానాకు గాని న్యాయం చేయలేకపోయారని చెప్పుకుంటున్నారు. ఎలక్షన్‌ సీజన్‌లో ప్రతి అంశం ఓటరును ప్రభావితం చేస్తుంది. అలాంటిది ఓ మండలాన్నే కుదిపేస్తున్న అక్రమ మైనింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తమ్మినేనికి మైనస్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అధికారంలో ఉండి కూడా అక్రమాలపై దర్యాప్తు చేయించలేకపోవడాన్ని ఎలా చూడాలని అడుగుతున్నారు స్థానికులు.

Leave A Reply

Your email address will not be published.