గొల్లపల్లి మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్ లో రక్షాబంధన్ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు సోదరా సోదరి భావంతో ఉండాలని ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు చాకచక్యంగా ఎదుర్కోవాలని ముఖ్యంగా లవ్ జిహాద్ బారిన పడకుండా విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించి ధర్మరక్షణకై కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు.
విదేశీ సంస్కృతి పాశ్చాత్య పోకడలకు పోకుండా మన దేశ ఔన్నత్యాన్ని పెంచాలని కోరారు.నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనం అందరం దేశానికి ధర్మానికి రక్ష అంటూ అందరూ రక్షాబంధన్ చేస్తూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో ఖండ సహా వ్యవస్థ శ్రీ కోటి నీలకంఠం. జిల్లా గో సంరక్షక్ సహా ప్రముఖ్ అడెపు నరేష్. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈరవేణి రాజకుమార్. విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షులు కుంభాకర్ అరుణ్. ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్. బజరంగ్ దళ్ కో కన్వీనర్ మాటూరి విజయ్. ఆర్ఎస్ఎస్ ఎనగందుల మహేష్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు