జైపూర్ జనవరి 28: సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బ్రాహ్మణులను, గోవులను కాపాడాలన్నారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పున: స్థాపన జరగాలని రాజస్థాన్ జాలౌర్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామన్నారు. దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు.
యోగి తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భారత్‌ను హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తారనే ప్రచారానికి యోగి తాజా వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయని ప్రతిపక్షనేతలంటున్నారు. రామ్