అమెరికా చేరుకున్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Narendra Modi మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొననున్నారు. మోదీ పర్యటనను ఎన్నారైలు ఓ పండుగలా భావిస్తున్నారు. హిస్టారికల్ ఈవెంట్స్‌ను గుర్తు చేసుకుంటూ మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల మోడ్‌లో ఉన్న అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌తో కలిసి డెలావర్‌లో నిర్వహించే నాల్గవ క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఇండో-పసిఫిక్ దేశాల అభివృద్ధి, పరస్పర సహకారం పై సమీక్ష సహా వచ్చే ఏడాది క్వాడ్ సమ్మిట్ అజెండాపై ప్రధానంగా చర్చిస్తారు. నాల్గో క్వాడ్ సమ్మిట్ నిజానికి భారత్‌లో జరగాల్సి ఉంది కానీ…
Read More