–అందత్వ రహిత తెలంగాణ ఏర్పడడమే మా ప్రభుత్వ లక్ష్యం
-పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
మంథని
కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు చేపట్టి ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతున్నాడని పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా మంథని మండలం ధర్మారం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ సోమవారం సందర్శించారు. కంటి పరీక్షలకు వచ్చే వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ కంటిచూపు మందగించినా దవాఖానకు పోలేక అంధకారంలో మగ్గుతున్న పేదలకు,వృద్ధులను కంటివెలుగుతో ఆదుకొనేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చెప్పట్టిందని అవసరమైన వారందరికీ శస్త్రచికిత్సతోపాటు కండ్లద్దాలను అందిస్తున్నామన్నారు. 2018లో కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకారం చుట్టారన్నారు. అందత్వ రహిత తెలంగాణ ఏర్పడడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెద్దపెల్లి జిల్లాలో 34 క్యాంపుల ద్వారా ఈ కంటి వెలుగును నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా వ్యవహరిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.