Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి టూర్ ప్యాకేజీని ప్రకటించిన తెలంగాణ టూరిజం

0

తెలంగాణ టూరిజం మీకోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం ఒక రోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.కాళేశ్వరం ప్యాకేజీ టూర్ పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోండ‌గా.. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో రామలింగేశ్వర స్వామి దేవాలయం మేడిగడ్డ బ్యారేజీ,కనేపల్లి పంప్ హౌజ్ కాళేశ్వర ఆలయంత‌దిత‌ర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు.

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా. ఇంజినీరింగ్‌లో 80 శాతం ,అగ్రికల్చర్‌, ఫార్మాలో 86 శాతం ఉత్తీర్ణత.

కాళేశ్వరం ప్రయాణం సాగుతుంది ఇలా
ప్రతి శనివారం, ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరితే వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్‌కు 8 గంటలకు చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రామప్పలో రామలింగేశ్వర స్వామి ఆలయ ద‌ర్శ‌నం ఉంటుంది. అనంత‌రం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ కనేపల్లి పంప్ హౌజ్ సందర్శిస్తారు. అక్క‌డ‌నుంచి సాయంత్రం 4 గంటలకు కాళేశ్వర ఆలయ దర్శనంఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.హైదరాబాద్ టూ కాళేశ్వరం టూర్ ప్యాకేజీ ధ‌ర| పెద్దలకు రూ.1850, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.1490 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బ‌స్సు టికెట్లు, దర్శనం, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie