Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద ఉద్రిక్తత

Tension at Vijayawada ACB court

0

ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారనే సమాచారం అందుకున్న ఆ పార్టీ శ్రేణులు విజయవాడలోని సిటీ కోర్టు కాంప్లెక్స్ వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

కృష్ణ, గుంటూరు జిల్లా నుంచి వచ్చిన టీడీపీ మహిళా కార్యకర్తలు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఈ రోజు లూథ్రా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie