A place where you need to follow for what happening in world cup

బీసీల బడ్జెట్ ను  20వేల కోట్లకు పెంచాలి

0

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చాంబర్ ను  ముట్టడించిన విద్యార్థులు  
హైదరాబాద్ ఫిబ్రవరి 16:బీసీల బడ్జెట్ ను  20వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చాంబర్ ను  ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్ధులనుద్దేశించి ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ మొత్తం రాష్ట్ర బడ్జెటు 2లక్షల 90వేల కోట్ల బడ్జెటులో బీసీలకు 6229 కోట్లు కేటాయిస్తే ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు.. ఇది రాష్ట్రంలోని 52 శాతం జనాభా గల బీసీలకు ఏ మూలకు సరిపోదు. దీనిని 20వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేసారు. ఈ ముట్టడికి నీల వెంకటేష్ నాయకత్వం వహించారు.బడ్జెటులో కొత్త స్కీములు ఏమీ లేవు. పెరిగిన ధరల ప్రకారం స్కాలర్ షిప్ లు, మెస్ చార్జీలు పెంచే ప్రస్తావన లేదు.

అలాగే కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజులు రియంబర్స్మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి బడ్జెట్ కేటాయింపు లేదు. అలాగే ఈ విద్యా సంవత్సరం కొత్తగా 119 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలు ఇస్తామని ఇచ్చిన హామీకి బడ్జెట్ కేటాయించలేదు. బిసి కార్పొరేషన్ లో 12 బిసి కుల ఫెడరేషన్ లకు పెండింగ్ లో ఉన్న 5 లక్షల 47 వేల దరఖాస్తులకు రుణాలు ఇవ్వడానికి కూడా ఈ బడ్జెటులో కేటాయింపులు లేవు. బీసీ స్టడీ సర్కిల్ బడ్జెటు కూడా పెంచలేదు. ఈ బడ్జెటు బీసీలకు సరిపోదు. కావున  బీసీ బడ్జెట్ రివైజ్ చేసి ఈ కింది పథకాలకు కేటాయింపులు చేయాలి.ఈ ముట్టడిలో, సతీశ్, సుధాకర్, సి. రాజేందర్, లక్ష్మణ్, గుజ్జ కృష్ణ, రాజ్ కుమార్,  జోషి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.