రాచకొండ: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిదిలోని ఎన్జీఓస్ కాలనీ లో ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారు జామున అతి వేగంగా వచ్చి..షాప్ ల పైకి కారు దూసుకెళ్లింది. ఉదయం కాలినడక చేస్తున్న వారికి తృటిలో ప్రమాదం తప్పింది.
ప్రమాదం జరిగిన సమయం లో …కారు 180 స్పీడ్ లో వున్నట్టు గుర్తించారు. కార్ లో వున్న ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. కార్ లోని యువకులు మద్యం మత్తులో వున్నారని స్థానికుల అనుమానం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు