బెంగళూరు: నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే వుందని నారాయణ హృదాయలయ ప్రకటించింది. జనవరి 27న కుప్పంలో అయన గుండెపోటుకు గురయిన విషయం తెలిసిందే. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతని పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని వైద్య బృందం పేర్కోంది. కార్డియాలజిస్ట్లు, ఇంటెన్సివిస్ట్లు మరియు ఇతర నిపుణులతో సహా బహుళ`క్రమశిక్షణా క్లినికల్ బృందం అయనకు వైద్యం అందిస్తోంది. అయన పరిస్థితి విషమంగానే వుందని వారుపేర్కోన్నారు