Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రఘురామ కస్టొడియల్ టార్చర్….

0

వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు  కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారన్న అంశంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని సీబీఐకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐకి హైకోర్టు సూచించింది.  తన కస్టోడియల్ టార్చర్ పై సీబీఐ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు. చాలా కాలం విరామం తర్వాత ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.

 

టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే  కాల్ డేటా ఉంచుతారని  విచారణ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు  రఘురామకృష్ణం రాజు న్యాయవాది నౌమీన్.  వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్దించారు.  సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాధ్ వాదనలు వినిపించారు.  ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ సిఐడీ వద్ద ఉందని అందువల్ల కాల్ డేటాను సీఐడీ సేకరించాలని అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాధ్ వాదించారు.

 

పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే… అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించారు.  మరో వైపు ఈ కేసులో సీఐడీ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుచేసింది. ల కాల్ డేటా సేకరించమనడం చట్టవిరుద్దమని  సీఐడీ తరపు న్యాయవాది  వాదించారు.  సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్ ను ఇంకా అనుమతించలేదని పేర్కొన్న హైకోర్టు..  సీబీఐకు ఇవ్వాలా… లేదా అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదని, ఈ కేసులో కాల్ డేటా కీలకమని రఘురామ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో వెంటనే కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.  కేసు విచారణ ను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.

పవన్ ప్రకటనలతో వైసీపీలో కలవరం.

రెండేళ్ల కిందట రఘురామకృష్ణరాజును ఆయన పుట్టిన రోజున హైదరాబాద్ లోని ఇంట్లో అరెస్ట్ చేశారు. ఏ కేసులు పెట్టారో కూడా చెప్పలేదు. నోటీసులు ఇవ్వలేదు. బలవంతంగా హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు. ఆ రాత్రి కస్టడీలో ఉంచుకున్నారు. తర్వాతి రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా తనను సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అప్పట్లో కోర్టు వైద్య పరీక్షలకు ఆదేశించింది. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో పరక్షలు చేశారు. గాయాలు అయినట్లుగా తేల్చారు. తనను కొట్టింది సీఐడీ  చీఫ్ సునీల్ కుమార్ అని, వీడియోలో చూసింది సీఎం జగన్ అని, దీని వెనుక ఎవరున్నారన్న దానిపై విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.  లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie