Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆన్ లైన్ వాల్యుయేషన్ కధ మళ్లీ మొదటికి

0

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ ఇంటర్మీడియేట్‌ ఆన్‌లైన్ వాల్యుయేషన్‌కి పిలిచిన టెండర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం (ఆన్‌లైన్) కోసం రెండోసారి టెండర్లు పిలవాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. తొలివిడతగా ఫిబ్రవరి 24న టెండర్ నోటిఫికేషన్ ఇవ్వగా.. బిడ్ల దాఖలుకు ఫిబ్రవరి 13తో గడువు ముగిసింది. వాల్యూయేషన్ చేసేందుకు ఒకే ఒక్క కంపెనీ ముందుకొచ్చింది. ఒకే బిడ్ వస్తే దాన్ని ఆమోదించడం కుదరదు. దీంతో వేరే బిడ్లు రాకపోవడంతో పిలిచిన టెండర్ రద్దు చేస్తూ ఇంటర్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఇంటర్ మార్చి పరీక్షలతోపాటు సప్లిమెంటరీ, పునఃపరిశీలనకు కలిపి మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. గ్లోబరీనా కానీ.. పేరు మార్చుకున్న కో ఆమ్ట్ ఎడ్యుటెక్ సంస్థ గానీ టెండర్లు దాఖలు చేయలేదని, దాన్నిబట్టి ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్ రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిందని ఆయన పేర్కొన్నారు.ఇదిఇలా ఉంటే గ్లోబరేనా సంస్థ చేసిన తప్పిదాలు వల్లే ఎంతో మంది విద్యార్థులకు మార్కులు తప్పులతడకగా పడినట్టు గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్ విద్యా మండలి ఆన్‌లైన్‌ వాల్యూయేషన్ కోసం జారీ చేసిన టెండర్స్‌ను రద్దు చేయడంపై తాజాగా డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఇక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లకి సంబంధించి మౌలికమైన మార్పులు చేసి అనుభవం ఉన్న సంస్థలతో ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌ని దశలవారీగా అమలు చేయాలని ఇంటర్ విద్య జేఏసి చైర్మన్ అన్నారు. అలాగే ఆన్‌లైన్‌ వాల్యుయేషన్ పట్ల అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, ప్రయోగాత్మక పద్ధతిని మే నెలలో జరగబోయే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పేపర్స్ వ్యాల్యుయేషన్ నుంచి అమలు చేయాలని ఇంటర్ బోర్డుకు సూచించారు.గ్లోబరీనా సంస్థే పేరు కో ఆమ్ట్ ఎడ్యుటెక్‌గా పేరు మార్చుకొని టెండర్లలో పాల్గొనబోతోందని, ఫిబ్రవరి 1న జరిగిన ప్రీ బిడ్ సమావేశానికి కూడా ఆ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారని మధుసూదన్ రెడ్డి ఫిబ్రవరి 7న ఆరోపించిన సంగతి తెలిసిందే. అదేరోజు రాత్రి స్పందించిన ఇంటర్ బోర్డు ఓ ప్రకటన జారీ చేస్తూ ఆ సంస్థ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారని, గ్లోబరీనా లేదా కోఆమ్ట్ సంస్థకు టెండర్లలో పాల్గొనే అర్హత లేదని స్పష్టం చేసింది. ఎందుకు అర్హత లేదన్నది ప్రకటించలేదు. ఒకవేళ బ్లాక్ లిస్ట్‌లో పెడితే ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారో వెల్లడించలేదు. బ్లాక్ లిస్టులో పెడితే.. ఆ సంస్థ చేసిన పనిని ర్యాటిఫై చేయాలని నవంబరు 11న జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో ఎజెండాగా ఎందుకు పెట్టారన్నది ప్రశ్న. జనవరి 30న నవీన్ మిత్తల్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కూడా గ్లోబరీనాను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ప్రకటించకపోవడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie