భక్తుల మనో భావాలు దెబ్బతింటున్నాయి
TTD To Distribute Wooden Sticks To Devotees For Safety From Wild Animals
శ్రీ వారి భక్తులు మనోభావాలు దెబ్బ తీసేలా టీటీడీ నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎర్ర చందనం స్మగ్లర్ల కారణంగా చిరుతలు ఊరికి సమీపంలో లోకి వస్తున్నాయని ఆయన అన్నారు. అడవిలో ఎర్రచందనం నరికే వారు పెరిగిపోయారని, కర్ర, పులి అంటూ భక్తులు భయపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నడకదారిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత టీటీడీ పై ఉందన్నారు భానుప్రకాశ్ రెడ్డి. ఒకటిన్నర నెల వ్యవధిలో ఏమి చర్యలు తీసుకున్నారని, ఫారెస్ట్ అధికారులు ఎంత బడ్జెట్ అడిగారు, ఎంత ఇచ్చారో తెలియదన్నారు.
ఫారెస్ట్ అధికారులకు, టీటీడీ కి మధ్య సమన్వయం లేదన్న భాను ప్రకాశ్ రెడ్డి.. మంత్రులు, ముఖ్య మంత్రి ఎందుకు స్పందించలేదన్నారు. కౌశిక్ ఘటన తర్వాత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని ఆయన మండిపడ్డారు. ఎర్ర చందనం స్మగ్లర్లు అదుపు చేస్తే చాలా మంది అధికారపార్టీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని, వేలకోట్ల రూపాయలు కొంత మంది అధికారులు, నాయకులకు వెళ్ళాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తిరుమల ఘటనపై ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. న్యాయ విచారణకు ఆదేశిస్తే నాయకులు, అధికారుల ప్రమేయం బయటకు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.