Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఔటర్ లోగుట్టు..ఏంటీ..

0

ఔటర్ రింగ్ రోడ్డు  టోల్ టెండర్ గుట్టును రాష్ట్ర సర్కారు బయటపెట్టడం లేదు. టెండర్ల నోటిఫికేషన్ దగ్గర నుంచి.. ఫైనలైజేషన్ వరకు అంతా రహస్యంగానే ఉంచింది. బేస్ ప్రైస్‌‌‌‌‌‌‌‌ ఎంత పెట్టారో కూడా చెప్పేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నది. మరోవైపు ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వార్తలు రాస్తే బెదిరింపులకు దిగుతున్నది. దీంతో ఈ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో ఏదో జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తిని ఒక ప్రైవేటు కంపెనీకి కొంత కాలం కోసం కట్టబెట్టినప్పుడు ఆ ఒప్పందం వివరాలను బయటకు చెప్పేందుకు ఉన్న అభ్యంతరాలు ఏమిటో అంతు చిక్కడం లేదు.

 

పారదర్శకంగా జరిగినప్పుడు టెండర్ డీటైల్స్ వెల్లడించేందుకు నిరాకరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టెండర్ దక్కించుకున్న ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ (ఐఆర్బీ) తన షేర్స్‌‌ను మేజర్గా సింగపూర్కు చెందిన ఒక పెట్టుబడి కంపెనీకి అమ్ముకున్నది. దీంతో అసలు ఈ కంపెనీకి ఎవరు యాజమానులు? అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరివి ఉన్నాయి? ఏ రూపంలో అవి తెలంగాణలో ఓఆర్ఆర్ను దక్కించుకున్నాయి? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గతేడాది నవంబర్లోనే టీవోటీ బిడ్ పిలిస్తే ఎక్కడా ప్రచారం కానివ్వకుండానే ప్రభుత్వం తతంగాన్ని ముగించింది.

 

మొత్తం రూ.7,380 కోట్లకు ఐఆర్బీ లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకున్నది. 11 సంస్థలు టెండర్లలో పాల్గొనగా.. 4 మాత్రమే ప్రైస్ బిడ్లకు అర్హత సాధించాయని స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ వెల్లడించారు. ఆ సంస్థలు ఏవి? ఏ మేరకు బిడ్ వేశాయనే వివరాలు మాత్రం చెప్పలేదు. ఎవరెవరు టెండర్ ఒప్పందంపై సంతకాలు చేశారనేది కూడా ప్రశ్నార్థకమే. రిటైర్డ్ ఆఫీసర్ను నియమించి ఆయనతోనే సంతకాలు చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. నెల రోజుల్లో పబ్లిక్ డొమైన్లో అన్ని వివరాలు పెడుతామని అరవింద్ కుమార్ చెప్పినప్పటికీ.. ఇప్పటి దాకా ఎలాంటి అప్డేట్ చేయలేదు.మహారాష్ట్రలో ఎక్స్ప్రెస్ వేకు పదేండ్ల కాలానికి ఒక రేటు, అదే తెలంగాణలో 30 ఏండ్లకు ఇంకో రేటు ఇవ్వడం ఏంటనే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు.

 

ఏకంగా 30 ఏండ్ల కాలానికి ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అతి తక్కువ మొత్తానికే కట్టబెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర సర్కార్ ఆస్తిని ఒక ప్రైవేట్ కంపెనీకి లీజుకిస్తే ఒప్పంద వివరాలు బయటకు చెప్పకపోవడం ఏంటని మండిపడుతున్నాయి.ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ టోల్ ఆపరేట్ ట్రాన్స్‌‌ఫర్ (టీవోటీ) టెండర్పై న్యాయస్థానానికి వెళ్తామని బీజేపీ ప్రకటించింది. టెండర్ ప్రక్రియలో అవినీతిపై సెంట్రల్ విజిలెన్స్, విచారణ సంస్థలు, మోడీ, అమిత్షాకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం టెండర్‌‌‌‌ను కట్టబెట్టిన ఐఆర్బీ సంస్థ 10 శాతం అడ్వాన్స్ కు సమయం కోరుతున్నదని ఓ పత్రికలో వచ్చిన వార్తపై స్పందించిన హెచ్ఎండీఏ.. సదరు పత్రికకు లీగల్ నోటీసు జారీ చేసింది.

ఆ ముగ్గురు రహస్య భేటీ..

అంతకంటే ముందు ఐఆర్బీ కూడా లీగల్ నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ పై ఏదైనా సమాచారం బయటకు వస్తే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీగల్ నోటీసులు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. సదరు కంపెనీతో పాటు హెచ్ఎండీఏ నుంచి కూడా లీగల్ నోటీసుల రావడం.. అసలు విషయాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంకోవైపు ఇదే విషయమై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆర్టీఐ అర్జీ దాఖలు చేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు.

 

ఓఆర్ఆర్ టెండర్‌‌‌‌పై రాజకీయ దుమారం చెలరేగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కరూ సప్పుడు చేయడం లేదు. మంత్రి కేటీఆర్ శాఖకు చెందిన అంశం కావడంతో ఆఫ్ ది రికార్డ్ కూడా మాట్లాడేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు జంకుతున్నారు. ప్రధానంగా 30 ఏండ్ల కాలపరిమితికి, అది కూడా అంత తక్కువ మొత్తానికి ఎలా ఇచ్చారనేది చెప్పడం లేదు. టోల్ చార్జీలు సదరు సంస్థ పెంచుకోవడానికి లేదని బయటికి చెబుతున్నారు. కానీ హెచ్ఎండీఏకు ప్రపోజల్స్ పంపిస్తే.. వాటిని ఆమోదిస్తే టోల్ పెరుగుతుందని అంటున్నారు.

 

టెండర్లోనే గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తుంటే.. ఇక టోల్ చార్జీలు పెంచుకునేందుకు అనుమతించరా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం రావడం లేదు. ఇంకోవైపు మహారాష్ట్రలోని ముంబై – పుణె ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు, ముంబై–పుణె నేషనల్ హైవే –4 టోలింగ్తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఐఆర్బీ 2020లో టెండర్ దక్కించుకున్నది. పదేండ్ల కాలపరిమితికి 1,014 లేన్ కిలోమీటర్లకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఎస్ఆర్డీసీ)కు ఏకంగా రూ.8,875 కోట్లు చెల్లించింది. ఇందులో రూ.6,610 కోట్లు ఏక మొత్తంలో మొదటి ఏడాదినే చెల్లింపులు చేసింది. అదే తెలంగాణలోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు 1,264  లేన్ కిలో మీటర్లకు.. 30 ఏండ్లకు రూ.7,380 కోట్లకు ఇవ్వడం ఏంటనే ప్రశ్నకు సమాధానం లేదు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie