Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తెలంగాణ విద్యుత్ సంస్థలో పీఆర్సీ చిచ్చు.

0

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల్లో స్తబ్దత నెలకొంది. గత మూడు, నాలుగు నెలలుగా ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీ కోసం యాజమాన్యంపై ఉద్యమించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు కూడా సిద్ధమయ్యారు. ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుతో పలుమార్లు విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ జేఏసీ చర్చలు జరిపింది. 30 నుంచి 40 శాతం పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు భీష్మించుకుని కూర్చున్నాయి. ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేదని… పీఆర్సీ అంత ఇవ్వలేమని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే ఉద్యోగులు, యాజమాన్యాన్ని కాదని ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు.

 

మంత్రి జగదీష్ రెడ్డితో చర్చలు జరిపారు. అక్కడ కూడా అలాంటి ప్రపోజల్ రావడంతో సమ్మెకు వెళ్తామని పీఆర్సీ జేఏసీ స్పష్టం చేసింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్ళొద్దని యాజమాన్యం ఆదేశించింది. ఈ విషయంలో సీఎండీ ప్రభాకర్ రావు, యూనియన్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో భేదాభిప్రాయాలు ఏర్పడ్డట్లు సమాచారం. ముఖ్యమంత్రి కూడా సీఎండీ ప్రభాకర్ రావు పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విద్యుత్ సౌధలో ఉద్యోగులు చర్చించు కుంటున్నారు.

 

అయితే చివరికి యాజమాన్యం చెప్పిన 7 శాతం పిఆర్సీతో పాటు పలు ఆర్థిక పరమైన అంశాలకు జేఏసీ నేతలు సమ్మతించారు.ఇదిలావుంటే, ఆర్టిజెన్స్ కూడా సమస్యలను పరిష్కరించాలని సమ్మెకు పిలుపునిచ్చారు. యాజమాన్యం వద్దని వారించినా వెనక్కి తగ్గలేదు. మూడు రోజుల పాటు సమ్మెకు దిగారు. సమ్మె విషయంలో ట్రాన్స్ కో, జెన్కో సీఎండీతో పాటు ఎన్పిడిసియెల్, ఎస్పీడిసియెల్ సీఎండీలు సైతం ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా కార్మిక సంఘాల నేతలు బలవంతంగా కార్మికులతో సమ్మె చేయించారు.

 

ఎస్మా ప్రయోగించి సుమారు 300 మంది కార్మికులను విధుల్లో నుంచి తొలగించింది యాజమాన్యం. ఇప్పుడు ఆ కార్మికులు రోజూ సీఎండీల కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం మిగతా కార్మికులపై చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు తమను క్షమించండి అని వేడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో సమ్మె ముగిసింది. యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు, కార్మికుల మధ్య గ్యాప్ పెరిగింది.గతంలో విద్యుత్ ఉద్యోగుల విభజన ఉద్యోగ సంఘాల నేతలకు, యాజమాన్యంకు మధ్య గ్యాప్ తెచ్చింది.

21 రోజుల అవతరణోత్సవాలు.

యాజమాన్యం పై యూనియన్ నేతల మితిమీరిన వ్యాఖ్యలకు సీఎండీ నొచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో, ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలోనే పని చేయాలి… తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వాలనే డిమాండ్ అప్పట్లో తెరమీదకు తెచ్చారు. అప్పటికే ఆ యూనియన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మంచి అభిప్రాయం ఉండటంతో సీఎండీ కూడా ఆ యూనియన్ నేతల మాటకు విలువిస్తూ వచ్చారు. ఒకానొక దశలో విభజన సమస్యల పై ఇరు రాష్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎండీ ప్రభాకర్ రావు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు అన్యాయం జరిగే సహించేది లేదని ఖరాకండిగా చెప్పిన పరిస్థితి.

 

అయితే ఇలా సంవత్సరాలు గడిచాయి. ఉద్యోగుల విభజన సమస్యల పై విద్యుత్ యాజమాన్యాలు, ఇంజినీర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం జస్టిస్ ధర్మాధికారి కమిటీని నియమించింది. చివరకు ధర్మాధికారి కమిటీ తుది తీర్పు కూడా వెల్లడించింది. తెలంగాణ ఇంజినీర్స్, యాజమాన్యాలకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ఇన్ని సంవత్సరాల్లో ఉద్యోగ సంఘాలు, యాజమాన్యం కలిసి సుమారు వంద కోట్ల రూపాయలు కోర్టు పనుల కోసం ఖర్చు చేశాయి. ఇంత చేస్తే ఇంజినీర్స్ కు న్యాయం జరిగాక పోగా… వందలాది మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు కేటాయించారు.

 

నిజానికి వారికి గడిచిన ఆరేళ్లుగా కూర్చో బెట్టి లక్షల జీతాలు చెల్లించాయి తెలంగాణ విద్యుత్ సంస్థలు.జస్టిస్ ధర్మాధికారి తుది తీర్పు తరువాత తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఆ యూనియన్ నేతల మాయ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది. ఉద్యోగుల విభజన విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత సదరు యూనియన్లు విద్యుత్ సౌధాలో ఒక సమావేశం ఏర్పాటు చేసి విద్యుత్ సంస్థల యాజమాన్యం, సీఎండీలు, డైరెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎండీ ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలపై నొచ్చుకుని వారిని దూరం పెట్టారు. తాజాగా మళ్ళీ అదే పరిస్థితి విద్యుత్ సంస్థల్లో నెలకొంది.

మండే.. సూరీడు..

యూనియన్లు, సీఎండీలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎండీలు ఆ పదవులకు అనర్హులని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. 60 ఏళ్లకు పదవీ విరమణ చేసిన వారిని 75 ఏళ్ళు వచ్చినా ఇంకా పదవుల్లో కొనసాగిస్తే ఇలాంటి సమస్యలే వస్తాయని వాపోతున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడం వల్ల సంస్థకే నష్టం వాటిల్లుతుందని నీతి సూత్రాలు చెబుతున్నాయి. విద్యుత్ సంస్థల్లో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie