వైసీపీ అధినేత జగన్ రెండోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక సార్లు ఇప్పటి వరకూ సర్వేలు చేయించినా కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి మాత్రం ప్రజల్లో అలాగే ఉంది. వారి పనితీరు కూడా మెరుగుపడలేదు. తనకు ఇష్టమైన, క్లిష్టసమయంలో తన పక్కన ఉన్నవారిని సయితం ఆయన పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారు. కొందరిని నియోజకవర్గాలకు మారిస్తే ఎలా ఉంటుందని సర్వేలు చేయిస్తున్నారు. దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ రaలక్ ఇచ్చే అవకాశముంది.
వీరిలో కొందరిని నియోజకవర్గాలను ఛేంజ్ చేయాలని చూస్తున్నారు. వర్గ విభేదాలతో పాటు ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల ఉన్న అసంతృప్తితో ఉన్న వారిని వచ్చే ఎన్నికలకు సైడ్ చేయాలని చూస్తున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే అధికారం కోల్పోకతప్పదని నిర్ణయానికి వచ్చిన జగన్ వారికి ప్రత్యామ్నాయ నేతలను కూడా అన్వేషిస్తున్నారని తెలిసింది. ఏ అభ్యర్థి అయితే గెలుపు సాధ్యమవుతుందన్న దానిపై ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా సర్వేలు కూడా చేయిస్తున్నారని తెలిసింది. ఐ ప్యాక్ టీంతో పాటు సొంత విూడియా నుంచి కూడా ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. అందిన సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశముందని తెలిసింది.