యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 16: జిల్లాలోని చౌటుప్పల్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పలువురికి గాయాలవడంతో వారిని స్థానికులు వెంటనే హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో నలుగురికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ఉన్నారు. మృతులు దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన సిలువేరు ధనమ్మ (30), వర్గాంతం అనసూయ (50), డాకోజి ధనమ్మ (25)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.